Mini Vande Bharat Express: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో మినీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

|

Jan 23, 2023 | 9:21 PM

దేశ వ్యాప్తంగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలు ప్రధాన నగరాలను కలుపుతూ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన విషయం..

Mini Vande Bharat Express: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో మినీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు
Vande Bharat Express
Follow us on

దేశ వ్యాప్తంగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలు ప్రధాన నగరాలను కలుపుతూ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను పెంచడం, జలంధర్‌తో లూథియానా లేదా కోయంబత్తూర్ వంటి టైర్-టూ నగరాలను మధురైతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో 8 కోచ్‌లతో మినీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. త్వరలో వాటిని పట్టాలెక్కించాలని కేంద్రం నిర్ణయించింది.ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో దీని కోసం ఒక నమూనా తయారు చేస్తోంది. సీటింగ్ అమరికతో కూడిన మినీ-వందే భారత్ ఎక్స్‌ప్రెస్ డిజైన్ దాదాపుగా ఫైనల్ అయినందున అటువంటి ఎనిమిది కోచ్‌ల వందే భారత్ ఈ ఏడాది మార్చి-చివరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ప్రస్తుతం ప్రారంభమైన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. విమానం తరహాలో సౌకర్యాలను పొందుపర్చింది. ఈ వందే భారత్ రైలు వేగం గంటకు 200 కిమీ వరకు ఉంటుంది. ఈ రైలులోని స్లీపర్ కోచ్‌ను అల్యూమినియంతో తయారు చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లు దేశవ్యాప్తంగా నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ కోచ్‌లకు ప్రత్యామ్నాయంగా మారనున్నాయి. దాదాపు 400 వందే భారత్ రైళ్లకు రైల్వే శాఖ టెండర్లు జారీ చేయగా, నెలాఖరులోగా ఆమోదం పొందనుంది. ఈ రైళ్ల నిర్మాణ పనుల కోసం 4 దేశీయ కంపెనీలతో సహా విదేశీ కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. మొదటి 200 వందే భారత్ రైళ్లలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ రైళ్లు గంటకు 180 కి.మీ. రైలు ట్రాక్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని గంటకు 130 కిమీ వేగంతో నడిచేందుకు అనుమతిని పొందనున్నట్లు రైల్వే తెలిపింది. దీనితోపాటు చైర్ కార్ రైళ్లను ఉక్కుతో తయారు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి