మారిన తత్కాల్‌ టిక్కెట్‌ బుకింగ్‌ రూల్స్‌..! ‍ప్రయాణికులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

భారతీయ రైల్వే తత్కాల్ టిక్కెట్ బుకింగ్ నిబంధనలను మార్చింది. ఇకపై AC క్లాస్ ఉదయం 10 గంటలకు, నాన్-AC క్లాస్ ఉదయం 11 గంటలకు ఒక రోజు ముందు బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి. PRS కౌంటర్లలో OTP విధానం ప్రవేశపెట్టారు.

మారిన తత్కాల్‌ టిక్కెట్‌ బుకింగ్‌ రూల్స్‌..! ‍ప్రయాణికులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
Train

Updated on: Jan 06, 2026 | 6:41 PM

భారతీయ రైల్వే తత్కాల్‌ టిక్కెట్ల బుకింగ్‌ రూల్స్‌ను మార్చింది. ఈ మార్పుల తర్వాత రైలు బయలుదేరే ఒక రోజు ముందుగానే తత్కాల్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. రైలు బయలుదేరే ఒక రోజు ముందు ఉదయం 10 గంటల నుండి AC క్లాస్‌, ఉదయం 11 గంటల నుండి తత్కాల్ బుకింగ్‌ ప్రారంభం అవుతుంది. ఉదాహరణకు రైలు 5వ తేదీన బయలుదేరుతుంది అనుకుంటే ప్రయాణీకుడు 4వ తేదీన ఉదయం 10 గంటలకు AC కోచ్‌లకు, నాన్-AC తరగతులకు ఉదయం 11 గంటలకు తత్కాల్ టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్లో పారదర్శకత పెంచేలా ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఆన్‌లైన్ తత్కాల్ బుకింగ్‌లకు ఆధార్ తప్పనిసరి, PRS కౌంటర్లు, ఏజెంట్లలో సిస్టమ్ ఆధారిత OTP తప్పనిసరి, అధీకృత ఏజెంట్లకు బుకింగ్ సమయ పరిమితి వంటి చర్యలు తీసుకున్నారు. ప్రయాణీకులు సూచించిన గుర్తింపు రుజువులలో ఏదైనా (ఒరిజినల్‌లో) తీసుకెళ్లాలి. ముఖ్యంగా ఏదైనా ప్రయాణీకుడు అసలు పత్రాన్ని సమర్పించకపోతే, టికెట్ లేకుండా ప్రయాణించినట్లుగా పరిగణించి, ఫైన్వేస్తారు.

ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సీరియల్ నంబర్ ఉన్న ఫోటో గుర్తింపు కార్డు, గుర్తింపు పొందిన పాఠశాల/కళాశాల వారి విద్యార్థుల కోసం జారీ చేసిన ఫోటో ఉన్న విద్యార్థి గుర్తింపు కార్డు, ఫోటో ఉన్న జాతీయం చేసిన బ్యాంకు పాస్‌బుక్, లామినేటెడ్ ఫోటో ఉన్న బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డులు, రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ, జిల్లా పరిపాలన, మున్సిపల్ సంస్థలు, పెంచ్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన సీరియల్ నంబర్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి TTEకి చూపించాల్సి ఉంటుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి