Indian Railways: ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ మార్గాల్లో 8 ప్రత్యేక రైళ్లు!

Indian Railways: ఇందులో అరకు-యలహంక ప్రత్యేక రైళ్లకు కొత్తగా మార్కాపూర్ రోడ్డు, నరసరావుపేట అదనపు స్టాపులుగా ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం రోడ్డు-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్డు అదనపు స్టాప్ లుగా ఇచ్చారు. అలాగే భువనేశ్వర్-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు..

Indian Railways: ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ మార్గాల్లో 8 ప్రత్యేక రైళ్లు!

Updated on: Nov 07, 2025 | 3:26 PM

Indian Railways: పండగల సీజన్‌లలో రైలు ప్రయాణికుల రద్దీ పెరుగుతుంటుంది. అయితే ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపడుతుంటుంది. ఇందు కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది. పలు స్టేషన్‌ల నుంచి అదనపు రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడుతుంటుంది. ఇదే క్రమంలో దక్షిణ రైల్వే పండుగల సందర్బంగా ప్రకటించిన 8 ప్రత్యేక రైళ్లలో అదనపు స్టేషన్ల హాల్ట్ లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఓ ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి: Petrol Pump: పెట్రోల్ పంపు యజమాని ఎంత సంపాదిస్తాడు? లీటరుకు ఎంత కమీషన్‌? నెలవారీ ఆదాయం!

23,24 తేదీల్లో అరకు-యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు:

ఇవి కూడా చదవండి

పండుగల సందర్భంగా ఈ నెల 23, 24 తేదీల్లో అరకు-యలహంక మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారు. అలాగే 14, 24 తేదీల్లో యలహంక నుంచి అరకుకు మరో రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు అధికారులు. తిరిగి 17, 24 తేదీల్లో అరకు నుంచి యలహంకకు మరో రెండు ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. అలాగే యలహంక నుంచి అరకుకు 18, 25 తేదీల్లో మరో రెండు ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. వీటితో పాటు 21న శ్రీకాకుళం రోడ్డు-బెంగళూరు కంటోన్మెంట్, 24న బెంగళూరు కంటోన్మెంట్ నుంచి శ్రీకాకుళం రోడ్డు, 16న భువనేశ్వర్ నుంచి బెంగళూరు కంటోన్మెంట్ కు, 20న బెంగళూరు కంటోన్మెంట్ నుంచి భువనేశ్వర్ కు ఒక్కో రైలు ప్రకటించారు.

అరకు-యలహంకకు ప్రత్యేక రైళ్లకు అదనపు స్టాప్‌లు:

ఇందులో అరకు-యలహంక ప్రత్యేక రైళ్లకు కొత్తగా మార్కాపూర్ రోడ్డు, నరసరావుపేట అదనపు స్టాపులుగా ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం రోడ్డు-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్డు అదనపు స్టాప్ లుగా ఇచ్చారు. అలాగే భువనేశ్వర్-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు అనకాపల్లి, గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్డు అదనపు స్టాప్ లుగా ఇచ్చారు. అలాగే సంబల్ పూర్-బెంగళూరు కంటోన్మెంట్, కటక్-బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైళ్లకు కూడా గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్డు అదనపు స్టాప్‌లుగా ఇచ్చారు.

PAN Card: డిసెంబర్‌ వరకే గడువు.. ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి