Indian Railway: వేరొకరి టికెట్‌పై రైల్లో ప్రయాణించవచ్చు.. ఎలాగో తెలుసా..

రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు ప్రయాణం చేయవచ్చు. మీకు టికెట్ బుక్ కాకపోయినా.. ఈ సౌకర్యంతో..

Indian Railway: వేరొకరి టికెట్‌పై రైల్లో ప్రయాణించవచ్చు.. ఎలాగో తెలుసా..
Railway Ticket Confirmation

Updated on: Oct 12, 2022 | 7:46 PM

మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారా.? అయితే మీకో ముఖ్య గమనిక. రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు ప్రయాణం చేయవచ్చు. మీకు టికెట్ బుక్ కాకపోయినా.. ఈ సౌకర్యంతో ఈజీగా ప్రయాణం చేసేయొచ్చు. మరి అదెలాగో తెలుసుకుందాం..

ఇండియన్ రైల్వేస్ తాజాగా ఓ నిబంధన అమలులోకి తీసుకొచ్చింది. మీ కుటుంబం సభ్యుల టికెట్‌పై ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది. అయితే మీరు ఎవరి టికెట్‌పై ప్రయాణించాలని అనుకుంటున్నారో.. వారు మీకు రక్త సంబంధీకులై ఉండాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట టికెట్ ఉంటే మీరు వారి టికెట్‌పై సులభంగా ప్రయాణించవచ్చు. అయితే దీనికంటూ ఓ ప్రక్రియ ఉంది.

మొదట ప్రయాణించాల్సిన వ్యక్తి పేరు బదులుగా.. ఎవరైతే ఆ టికెట్‌పై ప్రయాణించాలనుకుంటున్నారో.. అతడి పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ట్రైన్ బయల్దేరే 24 గంటల ముందుగా మీరు సంబంధిత రైల్వే అధికారులకు అవసరమైన డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని అధికారులు పరిశీలించి.. ఆ తర్వాత టికెట్‌పై ప్రయాణించాల్సిన సభ్యుడి పేరును ఉంచుతారు.

అలాగే విద్యాసంస్థల విద్యార్థులకు టికెట్ బదిలీ సౌకర్యాన్ని కూడా భారతీయ రైల్వే అందిస్తోంది. అటువంటి పరిస్థితిలో బయలుదేరడానికి 48 గంటల ముందు అవసరమైన పత్రాలతో లెటర్‌హెడ్‌పై ఇనిస్టిట్యూట్ హెడ్ రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే.. దాన్ని రైల్వే అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తారు.

పండుగ సమయంలోనూ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా..

పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లేవారికి రైలు టికెట్ల కన్ఫర్మేషన్‌ పెద్ద సమస్యగా మారుతోంది. 2-3 నెలల ముందే టికెట్ తీసుకున్నా వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండటం జరుగుతోంది. అయితే ఈ సమస్యను వికల్ప్ పధకం ద్వారా పరిష్కరించవచ్చు. వెయిటింగ్ టిక్కెట్లు కన్ఫర్మ్ కాని ప్రయాణీకులకు భారతీయ రైల్వే.. వికల్ప్ పధకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం కింద వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు మరొక ప్రత్యామ్నాయ రైలులో సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us