భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపడం, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటివి నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుంది. ఇక నవంబర్ నెల ముగియనుండటంతో ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్, జనవరిలో, శీతాకాలం ప్రారంభంతో దట్టమైన పొగమంచు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రైళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. దట్టమైన పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోందని, ఈ నేపథ్యంలో కొన్ని సార్లు గంటల తరబడి రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. పొగమంచు కారణంగా పలుమార్లు రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతోంది. దీంతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో పాటు రైళ్లు ఆలస్యంగా రావడంతో పలుమార్లు ప్రయాణికులు సైతం రైల్వే స్టేషన్ల వద్ద గుమిగూడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు ఉత్తర మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక సన్నాహాలు చేసింది.
నార్త్ సెంట్రల్ రైల్వే ఈ ప్రత్యేక సన్నాహాలను చేస్తోంది. గత కొన్నేళ్లుగా దట్టమైన పొగమంచు కారణంగా రైల్వే చాలా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పొగమంచు వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉత్తర మధ్య రైల్వే ప్రత్యేక సన్నాహాలు చేసింది. దీంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లో గంటల తరబడి చలిలో నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. రైల్వే శాఖ చలికాలంలో పొగమంచి కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తోంది.
1. పొగమంచు కారణంగా ఎవరైనా ప్రయాణికుల రైలు 1 గంట కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తుంటే ఆ విషయాన్ని అతనికి మెసేజ్‌ద్వారా తెలియజేస్తారు.
2. ఈ సందేశం ప్రయాణికుల రిజిస్టర్డ్ మొబైల్‌కు పంపబడుతుంది.
3. రైలు ఆలస్యమైతే రైల్వే స్టేషన్‌లోని ఆహార పానీయాల స్టాల్స్ ఎక్కువ సమయం పాటు తెరిచి ఉంచుతారు. దీంతో ప్రయాణికులకు భోజన, పానీయాల సౌకర్యం కూడా కొనసాగుతుంది.
4. దీనితో పాటు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల భద్రత కోసం అదనపు సిబ్బంది, ఆర్‌పీఎఫ్‌ను అందుబాటులో ఉంచుతుంది.
5. దీనితో పాటుగా, ప్రయాణికులకు రైళ్ల గురించి ఎప్పటికప్పుడు మాన్యువల్ అనౌన్స్‌మెంట్‌లు చేస్తుంటారు.
6. విశ్రాంతి గది, వెయిటింగ్ రూమ్, టాయిలెట్, ఇతర సౌకర్యాలు లాంజ్‌లో ఏర్పాటు చేస్తారు.
పైన పేర్కొన్న అన్ని ఏర్పాట్లతో పాటు, ప్రయాణికులకు సహాయం చేయడానికి రైల్వే 139 నంబర్‌ను కూడా జారీ చేసిందని రైల్వే శాఖ తెలిపింది. దీనికి కాల్ చేయడం ద్వారా మీరు మీ రైలుకు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా పొందవచ్చు. ఇది కాకుండా రైల్వేలో విచారణ కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా మీరు మీ రైలు స్థితిని తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి