Indian Railways: రైళ్లు పగటిపూట కంటే రాత్రుల్లో వేగంగా వెళ్తాయి.. ఎందుకో తెలుసా..?

|

Dec 30, 2022 | 11:10 AM

ఇండియన్‌ రైల్వే.. భారతదేశంలో రవాణా వ్యవస్థలో అతిపెద్దది అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు తమతమ గమ్యస్థానాలకు..

Indian Railways: రైళ్లు పగటిపూట కంటే రాత్రుల్లో వేగంగా వెళ్తాయి.. ఎందుకో తెలుసా..?
Indian Railways
Follow us on

ఇండియన్‌ రైల్వే.. భారతదేశంలో రవాణా వ్యవస్థలో అతిపెద్దది అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు తమతమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. రైల్వే శాఖ కూడా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంటుంది. అయితే రైల్వేలో కొన్ని విషయాలు అందరికి తెలిసి ఉండవు. వాటిని తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. అందులో ఎంతో టెక్నాలజీ దాగి ఉంటుంది. రైలు పట్టాల నుంచి రైలు బోగిల వరకు అన్ని కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. కొన్నింటి లాజిక్స్‌ చూస్తే అబ్బా ఇందులో ఇంత అర్థం ఉందా? అని ఆశ్చర్యపోతారు. కొన్ని రైళ్లు వేగంగా వెళితే..మరికొన్ని రైళ్లు తక్కువ వేగంతో వెళ్తాయి. ఇక రైళ్లు పగటి పూట కంటే రాత్రుల్లో అతి వేగంగా వెళ్తాయి. ఇలా ఎందుకు వెళ్తాయో అనే విషయాన్ని మీరెప్పుడైనా గమనించారా? అందుకు కారణం కూడా ఉందండోయ్‌. ఈ కారణాలేంటో చూద్దాం.

ప్రపంచ వ్యాప్తంగా భారత రైల్వే నాలుగో అతిపెద్ద వ్యవస్థ. మొత్తం68 వేలకుపైగా కిలోమీటర్లతో రైలు మార్గం విస్తరించింది ఉంది. పగటిపూట ఎందుకు రైళ్లు వేగంగా వెళ్ళవు..? రాత్రిళ్ళు ఎందుకు వేగంగా వెళ్తాయి అనే విషయాన్ని గమనిస్తే.. పగటి పూట రైల్వే ట్రాక్ పై ఎక్కువ జన సంచారం ఉండటం, అక్కడకడ్కడ ట్రాక్‌ పనులు చేపడుతుండటం, మనుషులు పట్టాలను దాటుతుండటం, అలాగే జంతువులు సైతం ట్రాక్‌పై నుంచి వెళ్తుండటం జరుగుతుంటుంది. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీటన్నింటని దృష్టిలో ఉంచుకుని పగటి సమయంలో రైలు తన స్పీడ్‌కంటే కాస్త నెమ్మదిగానే ఉంటుంది. ఇక రాత్రుల్లో జన సంచారం ఉండదు. ట్రాక్‌పై ఎలాంటి జంతువులు గానీ, మనుషులు గాని వెళ్లేందుకు ఆస్కారం ఉండదు. పైగా పగటి పూటకంటే రాత్రి సమయాల్లో సిగ్నల్స్‌ బాగా కనబడతాయి. సిగ్నల్స్ కూడా రాత్రిపూట రైలు ముందుకు వెళ్లాలా ఆగిపోవాలా అనేది క్లియర్‌ కనిపిస్తుంటుంది.

దూరం నుండి బాగా కనబడుతుంది. ఈ కారణం వల్లనే లోకోపైలట్లు వేగంగా వెళ్తుంటారు. ఒకవేళ రైలు ఆగాల్సి వచ్చినప్పుడు దూరం నుండి సిగ్నల్ చూసి ఆపుతారు. అలాగే చాలా మంది పగటి సమయంలో ట్రాక్‌ వద్ద సబ్‌వే ఉన్నా కూడా వాటిపై నుంచి వెళ్లకుండా ట్రాక్‌పై వెళ్తుంటారు. రాత్రుల్లో ఎవ్వరు కూడా ట్రాక్‌పై నుంచి వెళ్లరు. అంతేకాదు రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే పగటిపూటనే చేస్తుంటారు. అందుకే డే సమయంలో కాస్త జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అదే రాత్రి సమయాల్లో పనులు జరగవు. అందుకే రైళ్లు పగటి కంటే రాత్రుల్లో వేగంగా వెళ్లడానికి అసలు కారణం ఇది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి