Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ రోజు 262 రైళ్ల రద్దు.. జాబితాను తెలుసుకోండిలా..!

|

Jun 22, 2022 | 10:01 AM

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లో ఒకటి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటారు..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ రోజు 262 రైళ్ల రద్దు.. జాబితాను తెలుసుకోండిలా..!
Follow us on

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లో ఒకటి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటారు రైళ్లు. తక్కువ ఛార్జీలతో ఉండే రైలు ప్రయాణాన్ని సామాన్యులు సైతం ప్రయాణిస్తుంటారు. అయితే వివిధ కారణాల వల్ల కొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా బుధవారం పలు రైళ్లను రద్దు చేస్తే మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తోంది రైల్వే శాఖ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే రైలు ప్రయాణం చేసేవారు ముందస్తుగా రైళ్ల షెడ్యూల్‌ను తెలుసుకోవడం మంచిది. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో యువత పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రైళ్ల సమయ వేళల్లో మార్పులు జరిగాయి. దీంతో కొన్ని రైళ్లను కొంతకాలం రద్దు చేయడం, సమయ వేళల్లో మార్పులు చేయడం జరిగింది. అలాగే పలుచోట్ల వరదల కారణంగా రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించింది రైల్వే శాఖ.

ఈరోజు 262 రైళ్లను రద్దు:

జూన్‌ 22న (ఈ రోజు) మొత్తం 262 రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించింది రైల్వే శాఖ. రద్దయిన రైళ్లలో బీహార్ నుంచి పెద్ద సంఖ్యలో రైళ్లు ఉన్నాయి. ఇది కాకుండా మొత్తం 9 రైళ్లను రీషెడ్యూల్ చేయాలని రైల్వే నిర్ణయించింది. ఇందులో రైలు నంబర్లు 04133, 05122, 05163, 05446, 12807, 13106, 16526, 17650 మరియు 22638 రైళ్లు ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజు మొత్తం 16 రైళ్లను దారి మళ్లించాలని నిర్ణయించారు రైల్వే అధికారులు. మీరు కూడా ఈరోజు రైలులో ప్రయాణించబోతున్నట్లయితే, రైల్వే స్టేషన్‌కు బయలుదేరే ముందు, ఖచ్చితంగా రద్దు చేయబడిన, దారి మళ్లించిన, రీషెడ్యూల్ చేయబడిన రైళ్ల జాబితాను తనిఖీ చేయండి.

ఇవి కూడా చదవండి

రద్దు, రీషెడ్యూల్ చేయబడిన రైళ్ల జాబితా:

రద్దు చేయబడిన రైళ్ల జాబితాను తనిఖీ చేయడానికి, ముందుగా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
అసాధారణమైన రైళ్లు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రద్దు చేయబడిన, రీషెడ్యూల్ చేయబడిన, దారి మళ్లించిన రైళ్ల జాబితాపై క్లిక్ చేయండి. ఇలా ముందస్తుగానే రైళ్ల జాబితాను తనిఖీ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకపోతే రైల్వే స్టేషన్‌కు వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి