Ethanol Blending: 2025కు పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ ఉండాలి.. కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారత్‌..

|

Jun 06, 2022 | 3:09 PM

ముడి చమురుపై అధికంగా ఆధారపడిన దేశాల్లో భారత్‌ ఒకటి.. భారత్‌ ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటుంది. ఫలితంగా విదేశీ నిల్వలు తగ్గిపోతున్నాయి...

Ethanol Blending: 2025కు పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ ఉండాలి.. కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారత్‌..
Petrol
Follow us on

ముడి చమురుపై అధికంగా ఆధారపడిన దేశాల్లో భారత్‌ ఒకటి.. భారత్‌ ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటుంది. ఫలితంగా విదేశీ నిల్వలు తగ్గిపోతున్నాయి. అందుకే పెట్రోల్‌, డీలీల్‌ ప్రత్యామ్నాయంగా ఇథనాల్, హైడ్రోజన్‌ వంటి వాటిపై దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ కలిపి వినియోగించాలనే లక్ష్యాన్ని భారత్‌ ఛేదించింది. అనుకున్న దాని కంటే 5 నెలల ముందే ఈ ఘనత సాధించింది. 2025-26 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలిపే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. ముడి చమురు దిగుమతుల్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ సమస్యల్ని అధిగమించేందుకు భారత ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది.

చెరకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్‌ తయారు చేసి, పెట్రోల్‌లో కలుపుతున్నారు. 2022 నవంబరుకు పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా… ప్రభుత్వ రంగ చమురు రిటైల్‌ సంస్థలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ , భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ల కృషితో ఇప్పటికే లక్ష్యాన్ని సాధించింది. ప్రస్తుతం దేశీయంగా 10 శాతం ఇథనాల్‌, 90 శాతం పెట్రోల్‌ కలిపిన పెట్రోల్‌ను విక్రయిస్తున్నారు. ఇందువల్ల రూ.41,500 కోట్ల విదేశీ మారకపు ద్రవ్యం (ఫారెక్స్‌) ఆదా కావడంతో పాటు, గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలు 27 లక్షల టన్నుల మేర తగ్గాయని తెలుస్తుంది. ఇథనాల్‌ తయారీకి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా రైతులకు రూ.40,600 కోట్ల చెల్లింపులు జరిగాయి. చెరకు నుంచి ఎక్కువగా ఇథనాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీల్లో ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌ ఒకటిగా ఉంది. హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడానికి కొన్ని కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.