ధరల నియంత్రణలో ఆర్బీఐ మరోసారి విఫలమైంది. ఆగస్ట్‌తో పోల్చుకుంటే సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. కేవలం నెల రోజుల్లోనే 7 నుంచి 7.41శాతానికి జంప్ చేసింది ద్రవ్యోల్బణం. ఫుడ్ ఇండెక్స్ కూడా భారీగా పెరిగిపోయింది. ఆహార ధరల సూచీ 7.62నుంచి అమాంతం 8.6శాతానికి పెరిగింది. దాంతో, నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నట్టు ప్రకటించింది స్టాటటిక్స్ మినిస్ట్రీ.
తాజా గణాంకాల ప్రకారం వెజిటబుల్స్ ధరలు 2.6 పర్సంటేజ్ పెరిగి 18.05శాతానికి పెరిగాయి. నాన్‌వెజ్ రేట్స్ కూడా భారీగానే పెరిగాయి. 1.3శాతం జంప్‌తో 2.55శాతానికి మాంసం ధరలు పెరిగినట్లు తెలిపింది. ఇక, దుస్తుల ధరలు 0.8శాతం పెరిగాయి. 0.4శాతం పెరుగుదలతో ఇంధన ధరలు 10.39శాతానికి జంప్ చేసినట్లు ప్రకటించింది కేంద్రం.
ఇక హౌసింగ్ రంగానిదీ అదే దారి. 0.3శాతం హైక్‌తో 4.57శాతానికి చేరింది హౌసింగ్ ఇండెక్స్. ఓవరాల్‌గా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ భారీగా పెరిగిపోవడంతో సామాన్యులపై అధిక భారం పడుతోంది. మరి, ద్రవ్యోల్బణం కంట్రోల్‌కు ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..