Interesting Story: తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. అప్పట్లో పాలు, చక్కెర ధరలు వింటే షాక్ అవ్వాల్సిందే!

Interesting Story: తులం బంగారం ధర కేవలం 90 రూపాయలు మాత్రమే.. లీటర్‌ పాలు కేవలం 20 రూపాయలే.. కిలో చక్కెర ధర 40 పైసలు మాత్రమే.. ఇంటి ఈ లెక్కలు చూస్తే వీడికేమైనా మతిపోయినట్లుంది అనుకుంటున్నారా? కానీ అలాంటిదేమి లేదు. మీరు చదవింది నిజమే..

Interesting Story: తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. అప్పట్లో పాలు, చక్కెర ధరలు వింటే షాక్ అవ్వాల్సిందే!
Interesting Story

Updated on: May 04, 2026 | 8:08 PM

Interesting Story: తులం బంగారం ధర కేవలం 90 రూపాయలు మాత్రమే.. లీటర్‌ పాలు కేవలం 20 రూపాయలే.. కిలో చక్కెర ధర 40 పైసలు మాత్రమే.. ఇంటి ఈ లెక్కలు చూస్తే వీడికేమైనా మతిపోయినట్లుంది అనుకుంటున్నారా? కానీ అలాంటిదేమి లేదు. మీరు చదవింది నిజమే. కానీ ప్రస్తుతం అనుకుంటే పొరపాటే. ఈ ధరలు 1950వ సంవత్సరంలోనివి. అప్పట్లో ఉండే ధరలను చూస్తే మీరు షాక్‌ అవ్వాల్సిందే. నేడు ఏ వస్తువు కొనాలన్నా వందలు, వేలు ఖర్చు చేయాల్సిందే. పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation) సామాన్యుడి నడ్డి విరుస్తోంది. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అంటే 1950వ సంవత్సరంలో మన దేశంలో ధరలు ఎలా ఉండేవో మీకు తెలుసా? అప్పటి ధరల జాబితాను చూస్తే మనం ఇప్పుడు ఒక పూట భోజనానికి ఖర్చు చేసే డబ్బుతో అప్పట్లో నెలంతా రాజభోగం అనుభవించేవారని అర్థమవుతుంది.

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజే భారీగా దిగి వచ్చిన బంగారం ధర.. వెండి పరిస్థితి ఏంటి?

1950 వర్సెస్ 2026: ధరల వ్యత్యాసం:

అప్పట్లో వస్తువుల ధరలు ఎంత తక్కువగా ఉండేవో ఈ క్రింది పోలికను బట్టి చూడవచ్చు:

ఇవి కూడా చదవండి
  1. బంగారం (Gold): ఈరోజు తులం బంగారం ధర రూ. 1,50,000 దాటిపోయింది. కానీ 1950లో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ. 90 మాత్రమే. అంటే ఈరోజు ఒక బిర్యానీ ప్లేట్ ధర కంటే తక్కువ.
  2. పాలు (Milk): ప్రస్తుతం లీటర్ పాలు రూ. 60 నుండి రూ. 70 వరకు ఉన్నాయి. అప్పట్లో లీటర్ పాలు కేవలం 20 పైసలు మాత్రమే.
  3. చక్కెర (Sugar): నేడు కిలో చక్కెర రూ. 45 – 50 పలుకుతోంది. 1950లో మాత్రం కిలో చక్కెర ధర కేవలం 40 పైసలు మాత్రమే.
  4. బియ్యం (Rice): అప్పట్లో రూపాయికి కొన్ని కిలోల బియ్యం వచ్చేవి. నేడు సన్న బియ్యం కిలో రూ. 60 కంటే ఎక్కువే ఉంది.

జీతాలు కూడా అలాగే ఉండేవి:

ధరలు తక్కువగా ఉన్నాయి కదా అని అప్పట్లో అందరూ ధనవంతులు అనుకుంటే పొరపాటే. వస్తువుల ధరలతో పాటే ప్రజల ఆదాయం కూడా చాలా తక్కువగా ఉండేది. 1950లలో ఒక సామాన్య ఉద్యోగి నెల జీతం రూ. 30 నుండి రూ. 50 మధ్యలో ఉండేది. ఆ తక్కువ జీతంతోనే అప్పట్లో పెద్ద కుటుంబాలు హాయిగా గడిచిపోయేవి.

ఎందుకీ మార్పు?

జనాభా పెరుగుదల, డిమాండ్ పెరగడం, రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్ల గత 75 ఏళ్లలో ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. అప్పటి ‘పైసల’ కాలం నుండి నేటి ‘వేల’ కాలానికి మన ఆర్థిక వ్యవస్థ భారీ మార్పులకు లోనైంది.

ఇది కూడా చదవండి: Gold Reserves: ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ ఉంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us