AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజే భారీగా దిగి వచ్చిన బంగారం ధర.. వెండి పరిస్థితి ఏంటి?

Gold, Silver Prices: గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల స్థానిక మార్కెట్లో తులం బంగారం ధరపై భారీగా తగ్గింపు కనిపించింది. ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులకు, ముఖ్యంగా మహిళలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల,24 క్యారెట్ల బంగారం ధరలు ఎంత మేర తగ్గాయో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి...

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజే భారీగా దిగి వచ్చిన బంగారం ధర.. వెండి పరిస్థితి ఏంటి?
Gold Price Today May 4th
Subhash Goud
|

Updated on: May 04, 2026 | 5:02 PM

Share

Gold Price Today: సోమవారం బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. ఉదయం స్వల్పంగా తగ్గినా తర్వాత మాత్రం భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు తగ్గడంతో భారతీయ కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. సోమవారం ఉదయంతో పోలిస్తే మధ్యాహ్నం సమయానికి తులం బంగారంపై ఏకంగా రూ.1300లకుపైగా తగ్గింది. అదే గత గురువారంతో పోలిస్తే రూ.1900 వరకు దిగి వచ్చింది.

గుడ్‌ రిటర్న్స్ వివరాల ప్రకారం.. ధర తగ్గిన తర్వాత బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,620 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,150 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,220 వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌, విజయవాడలో తులం బంగారం ధర రూ.1,49,620 వద్ద ఉండగా, అదే ఢిల్లీలో రూ.1,49,770 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కాస్త ఎక్కువగా ఉంది. అదే చెన్నైలో మాత్రం ఇంకా ఎక్కువగా ఉంది. ఇక్కడ తులం బంగారం ధర రూ.1,52,730 కొనసాగుతోంది. ఇంటే ఇతర ప్రాంతాలతో పోలిస్తే దాదాపు 2000 రూపాయలకుపైగానే ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Thalapathy Vijay: దళపతి విజయ్ దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం అవుతారా? ఆయన సంపద గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇక వెండి పరిస్థితి ఏంటి?

బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండగా, వెండి పరిస్థితి మాత్రం పెద్దగా తేడా లేదు. సిల్వర్‌ ధర నిలకడగానే ఉంది. సాయంత్రం 4.30 గంటల సమయంలో కేజీ సిల్వర్‌ ధర రూ.2,65,000 ఉంది. అదే హైదరాబాద్‌, చెన్నై, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధర ఎందుకు పడిపోతోంది

బంగారం ధరలలో కొనసాగుతున్న తగ్గుదలకు ముడి చమురు, డాలర్ సూచీ కారణమవుతున్నాయి. ముడి చమురు ధరలలో నిరంతర పెరుగుదల ప్రపంచ ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచవచ్చు.

డాలర్ సూచీ కూడా నిరంతరం బలంగా కొనసాగుతోంది. దీనివల్ల పెట్టుబడిదారులు బంగారానికి బదులుగా డాలర్లలో పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా బంగారం ధరలు పడిపోవడానికి కారణమవుతోంది. దీనికి తోడు, బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో పెట్టుబడిదారులు దూరంగా ఉంటున్నారు. బలహీనమైన సెంటిమెంట్ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపింది.

ఇది కూడా చదవండి: Gold Reserves: ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ ఉంది?

ఇది కూడా చదవండి: WhatsApp: సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ లిస్టులో ఉందేమో చెక్ చేసుకోండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇవి కొండచిలువను కొరికి నమిలేస్తాయ్.. తాచుపాము కరిచినా ఏం కాదు..
ఇవి కొండచిలువను కొరికి నమిలేస్తాయ్.. తాచుపాము కరిచినా ఏం కాదు..
టీవీకే విజయ్‌ తండ్రికి, చిరంజీవికి ఉన్న సంబంధమేంటో తెలుసా?
టీవీకే విజయ్‌ తండ్రికి, చిరంజీవికి ఉన్న సంబంధమేంటో తెలుసా?
మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజే భారీగా దిగి వచ్చిన బంగారం ధర..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజే భారీగా దిగి వచ్చిన బంగారం ధర..
కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
మరో వారంలో TG ICET 2026 రాత పరీక్షలు.. హాల్‌టికెట్ల లింక్ ఇదిగో
మరో వారంలో TG ICET 2026 రాత పరీక్షలు.. హాల్‌టికెట్ల లింక్ ఇదిగో
ఇటు ధోనీకి ఇచ్చిపేడేసి.. అటు రోహిత్, కోహ్లీల సరసన చేరిన 'పాండే'
ఇటు ధోనీకి ఇచ్చిపేడేసి.. అటు రోహిత్, కోహ్లీల సరసన చేరిన 'పాండే'
హోమ్ లోన్‌తో ఇల్లు కొనాలనుకునేవారు ఇప్పుడే కళ్లు తెరవండి.!
హోమ్ లోన్‌తో ఇల్లు కొనాలనుకునేవారు ఇప్పుడే కళ్లు తెరవండి.!
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ వీడియో
చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ వీడియో