
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి నేటికి సరిగ్గా 79 ఏళ్లు పూర్తయింది. 80వ ఏటలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చనీయాంశంగా మారాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ, బంగారం ధరలకు సంబంధించిన విషయాలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరల గత రెండేళ్లుగా భారీగా ఎగబాకిన విషయం తెలిసిందే. అంతకముందు తులం బంగారం రూ.70 వేలుగా ఉండగా.. రెండేళ్లల్లో భారీగా పెరిగి ప్రస్తుతం రూ.1.51 లక్షల వద్ద కొనసాగుతోంది. అయితే స్వాతంత్య్రం వచ్చినప్పుడు బంగారం ధర అత్యంత తక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతూ వస్తోన్నాయి. బంగారం ధరల్లో వచ్చిన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1947లో 10 గ్రాముల బంగారం ధర రూ.88.62గా ఉంది. ప్రస్తుతం రూ.1.51 లక్షలకు చేరుకుంది. అంటే ఏకంగా 1711 రేట్లు పెరిగింది. ఈ లెక్క ప్రకారం మీరు 1947లో తులం బంగారం రూ.వెయ్యి పెట్టి కొనుగోలు చేస్తే ఇప్పుడు అది రూ.17.1 లక్షలు అయ్యేదని చెప్పవచ్చు. దీనిని బట్టి చూస్తే 80 ఏళ్లల్లో బంగారం ధరల ఎంత భారీగా పెరిగిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1947లో తులం బంగారం రూ.88.62గా ఉండగా.. 1950కి రూ.99, 1964కు రూ.63, 1970కి రూ.184, 1980కి రూ.1330కి చేరుకుంది. 2001లో రూ.4473, 2011కి రూ.19,227, 2021కి రూ.48,733, 2025కు రూ.75 వేలకు చేరుకుంది. కాలాన్ని బట్టి బంగారం ధరలు పెరుగతూ వస్తోన్నాయి. దీనికి కారణం బంగారానికి ఉన్న అధిక డిమాండ్‌గా చెప్పవచ్చు.
ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. 1970లో కిలో వెండి రూ.536గా ఉండగా.. ప్రస్తుతం రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే కాలం మారే కొద్ది బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా వీటి ధరల పెరుగుదల ఇలాగే కొనసాగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల డిజిటల్‌గా బంగారంలో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువా ఉంటున్నారు. గతంలో ఫిజికల్‌గా బంగారం కొని ఇంట్లో భద్రపర్చుకునేవారు. కానీ ఇప్పుడు వీటిల్లో డిజిటల్‌గా పెట్టుబడులు పెడుతున్నారు.