Income Tax: ఫారం-16 లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయవచ్చా? ఎలాగో తెలుసుకోండి

పన్ను రిటర్నులు దాఖలు చేయడంపై చాలా మందికి అనేక ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా ఫారం 16 లేకపోతే రిటర్న్‌ దాఖలు చేయవచ్చో లేదో కూడా చాలా మందికి తెలియదు. మీరు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ITR ఫైల్ చేయాలనుకుంటే, ఏమి చేయాలో తెలుసుకోండి. ఎక్కువ సమయం మిగిలి లేదు. జూలై నెలలోపు దాఖలు చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు జూలై 31 చివరి రోజు. మీరు ఇప్పటికీ మీ కార్యాలయం..

Income Tax: ఫారం-16 లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయవచ్చా? ఎలాగో తెలుసుకోండి
Income Tax

Updated on: Jul 16, 2024 | 5:40 PM

పన్ను రిటర్నులు దాఖలు చేయడంపై చాలా మందికి అనేక ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా ఫారం 16 లేకపోతే రిటర్న్‌ దాఖలు చేయవచ్చో లేదో కూడా చాలా మందికి తెలియదు. మీరు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ITR ఫైల్ చేయాలనుకుంటే, ఏమి చేయాలో తెలుసుకోండి. ఎక్కువ సమయం మిగిలి లేదు. జూలై నెలలోపు దాఖలు చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు జూలై 31 చివరి రోజు. మీరు ఇప్పటికీ మీ కార్యాలయం నుండి ఫారమ్-16 అందుకోకపోతే, అలాగే ఐటీఆర్‌ ఫైల్ చేయడంలో సమస్య ఉంటే, సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి.

మీరు ఫారమ్-16 లేకుండానే ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఇది తప్పనిసరి పత్రం కాదు. మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ నుండి ఫారం-26AS, AIS లేదా TIS సర్టిఫికేట్ పొందడం ద్వారా పన్నును దాఖలు చేయవచ్చు. మీరు ఫారమ్-16 లేకుండా మీ ఐటీఆర్‌ ఫైల్ చేయాలనుకుంటే కొన్ని పత్రాలు అవసరం. జీతం స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, బ్యాంక్ నుండి టీడీఎస్‌ సర్టిఫికేట్, ఇంటి అద్దె రుజువు, పెట్టుబడి రుజువు అవసరం. ఫారం-26AS లేదా AIS లేదా TIS అవసరం.

ఇది కూడా చదవండి: SBI: వినియోగదారులకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. బ్యాంకు కీలక నిర్ణయం

ముందుగా, ఆదాయంపై పన్ను విధించబడుతుందా లేదా అనేది లెక్కించాలి. గణనలను చేతితో సులభంగా చేయవచ్చు లేదా ఆన్‌లైన్ సాధనాలను ఉపయోగించి లెక్కించవచ్చు. టీడీఎస్‌ వివరాలను పొందడానికి ఆదాయపు పన్ను సైట్ నుండి ఫారం-26AS లేదా AISని డౌన్‌లోడ్ చేసుకోండి. పన్ను విధించదగిన ఆదాయాన్ని లెక్కించిన తర్వాత, మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను సాధారణ ఐటీఆర్‌ లాగా ఫైల్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Petrol Price Hike: వామ్మో.. మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర.. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us