Indian Railways: ట్రైన్‌లో మిడిల్ బెర్త్‌లో ప్రయాణిస్తున్నారా..? రైల్వేశాఖ ప్రత్యేక రూల్స్.. పాటించకపోతే చర్యలే..

రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక రూల్స్‌ను అమలు చేస్తోంది. రైళ్లల్లో ప్రయాణించే ప్రతీఒక్కరూ వీటి గురించి తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా మధ్య బెర్త్‌లో ప్రయాణించేవారి ప్రత్యేకంగా కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే రైల్వేశాఖ మీపై చర్యలు తీసుకోవచ్చు.

Indian Railways: ట్రైన్‌లో మిడిల్ బెర్త్‌లో ప్రయాణిస్తున్నారా..? రైల్వేశాఖ ప్రత్యేక రూల్స్.. పాటించకపోతే చర్యలే..
Indian Railway

Updated on: Mar 26, 2026 | 8:00 PM

తరచూ లక్షలాది మంది రైళ్లల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ట్రైన్స్‌లో అనేక రూల్స్ అమల్లో ఉంటాయి. కానీ ప్రయాణం చేసే చాలామందికి వీటి గురించి అవగాహన ఉండదు. ముఖ్యంగా రైళ్లల్లో మీరు మిడిల్ బెర్త్‌లో ప్రయాణం చేస్తుంటే ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. మీతో పాటు కలిసి ప్రయాణం చేసే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీరు ఈ నిబంధలను ఖచ్చితంగా పాటించాల్సిందే. లేకపోతే మీపై తొటి ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు. మధ్య బెర్త్‌లో ప్రయాణికులకు రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తోంది. మీరు ఎప్పుడు నిద్రపోవాలి..? ఎప్పుడు కూర్చోవచ్చు..? అనే దానిపై రైల్వేశాఖ కొన్ని టైమింగ్స్‌ను తీసుకొచ్చింది. అవేంటో చూద్దాం.

ఈ సమయంలో మాత్రమే అనుమతి

మీరు రిజర్వుడ్ బోగీలో మిడిల్ బెర్త్‌లో ప్రయాణం చేస్తుంటే.. ఇష్టానుసారం నిద్రపోవడానికి లేదు. మీరు నిద్రపోతే లోయర్ బర్త్, అప్పర్ బోర్త్‌లో ప్రయాణించేవారికి అసౌకర్యం కలుగుతుంది. దీంతో మధ్య బెర్త్‌లో సీట్లకు సంబంధించి రైల్వేశాఖ నియమాలు ఎప్పటినుంచో అమలు చేస్తోంది. మీరు మిడిల్ బెర్త్‌లో ప్రయాణిస్తుంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే నిద్రపోవడానికి సీటును ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత లోయర్, అప్పర్ బెర్తుల్లోని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సీటును వాడుకోవాల్సి ఉంటుంది. అయితే నియమాల నుంచి గర్బిణీలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారికి మినహాయింపు ఉంది. కానీ అలాంటివారు టీటీఈ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కింద సీటులో ప్రయాణించే వ్యక్తి అంగీకారంతో మీరు సమయ పరిమితిని పెంచుకోవచ్చు.

ఎప్పుడు ఫిర్యాదు చేయాలి..?

కొంతమంది మిడిల్ బెర్త్‌లో ప్రయాణించేవారు లోయర్, పై బర్త్ ప్రయాణికులతో వాగ్వాదానికి దిగుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో అసౌకర్యానికి గురైన ప్రయాణికులు టీటీఈకి ఫిర్యాదు చేయాలి. అప్పడు టీటీఈలు స్పందించి సమస్యను పరిష్కరిస్తారు. ఇక లోయర్, బై బెర్త్‌లకు ఎలాంటి సమయ పరిమితి అనేది ఉండదు. మధ్య బెర్త్‌లో ప్రయాణించేవారికి మాత్రమే ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. ఈ నిబంధనల గురించి రైల్వేశాఖ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోంది. ప్రయాణికుల మధ్య గొడవలు చోటుచేసుకోకుండా వీటి గురించి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వీడియోలు పోస్ట్ చేస్తోంది. ప్రయాణికులందరూ ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాలని సూచిస్తోంది. ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెట్టవద్దని చెబుతోంది. సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే లక్ష్యంగా ఈ నిబంధలను రైల్వేశాఖ ఎప్పటినుంచో అమలు చేస్తోంది. ఇవే కాకుండా రైళ్లల్లో ఉండే రూల్స్ గురించి ప్రయాణిలకు అవగాహన కల్పిస్తోంది.

Follow Us