Fake Liquor: కాస్ట్లీ బాటిల్‌లో చీప్‌ లిక్కర్‌.. కల్తీ మాఫియా గుట్టు రట్టు! నకిలీ మద్యం బాటిళ్లను గుర్తుపట్టొచ్చా? ఈ ట్రిక్స్‌ వాడితే సరి

నకిలీ మద్యం రాకెట్ బయటపడిన నేపథ్యంలో కల్తీ మద్యాన్ని గుర్తించడంపై మద్యం ప్రియులు దృష్టి పెడుతున్నారు. ప్యాకేజింగ్, సీల్, బాటిల్ నాణ్యత, పన్ను స్టాంప్, బార్‌కోడ్ వంటి వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. మద్యం రంగు, నురుగు, స్టిక్కర్, సీరియల్ నంబర్‌లను గమనించడం ద్వారా అసలు మద్యం, నకిలీ మద్యం మధ్య తేడాలను తెలుసుకొని, మోసపోకుండా సురక్షితంగా ఉండవచ్చు.

Fake Liquor: కాస్ట్లీ బాటిల్‌లో చీప్‌ లిక్కర్‌.. కల్తీ మాఫియా గుట్టు రట్టు! నకిలీ మద్యం బాటిళ్లను గుర్తుపట్టొచ్చా? ఈ ట్రిక్స్‌ వాడితే సరి
Fake Liquor

Updated on: Nov 10, 2025 | 10:54 PM

ఘజియాబాద్‌లోని శాస్త్రి నగర్ ప్రాంతంలోని లైసెన్స్ పొందిన మద్యం దుకాణం వెనుక ఉన్న రహస్య గదిలో ఒక పెద్ద నకిలీ మద్యం రాకెట్ బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణం వెనుక ఉన్న రహస్య గదిలో నకిలీ ప్రీమియం బ్రాండ్ మద్యం తయారు చేస్తున్నారు. సంఘటన స్థలం నుండి నకిలీ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. చండీగఢ్ నుండి వచ్చిన సీసాలు, మీరట్ నుండి వచ్చిన నకిలీ క్యాప్‌లను ఉపయోగించి ఇక్కడ అక్రమ మద్యం తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఇలాంటి నకిలీ మద్యం కేసులు పెరిగిపోతున్న తరుణంలో అసలు.. నిజమైన మద్యం ఏదో నకిలీ మద్యం ఏదో తెలుసుకోవడం కష్టం అయిపోతుంది. మరి వాటిని గుర్తించే విధానాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

  • ప్యాకేజింగ్, ప్రింటింగ్లో తేడా ఉంటుంది.
  • నిజమైన మద్యం బాటిళ్లలో పన్ను స్టాంప్, బార్‌కోడ్/క్యూఆర్ కోడ్, స్పష్టమైన ప్రింటింగ్, సరైన స్పెల్లింగ్ ఉంటాయి. లేబుల్ అస్పష్టంగా ఉంటే, రంగు మసకగా ఉంటే లేదా స్పెల్లింగ్ తప్పులు ఉంటే అది నకిలీ మద్యం బాటిల్‌గా గుర్తించాలి.
  • క్యాప్‌ లేదా సీల్.. ఫ్యాక్టరీ-సీల్ చేసిన బాటిల్ క్యాప్‌ చక్కగా సరిపోతుంది. వదులుగా ఉన్న క్యాప్‌ లేదా సరైన సైజ్‌లో లేని క్యాప్‌ ఉంటే అది కూడా నకిలీ మద్యంగా గుర్తించాలి.
  • సీసా నాణ్యత.. బ్రాండెడ్ బాటిళ్లకు దిగువన లేదా వైపున బ్రాండ్ పేరు లేదా శాశ్వత గుర్తు ఉంటుంది. చౌకైన నకిలీ వెర్షన్లలో ఇది ఉండదు.
  • మద్యం నాణ్యతను దాని రంగు, నురుగు బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు.
  • బాటిల్‌ను సున్నితంగా కదిలిస్తే నురుగుగా కనిపిస్తే అది నకిలీ మద్యం కావొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బుడగలు నెమ్మదిగా దిగువకు పడితే, మద్యం నకిలీది కావచ్చు. రంగు మారడం లేదా అసమానత కూడా కల్తీకి నిదర్శనం.
  • స్టిక్కర్, సీరియల్ నంబర్‌ను చెక్‌ చేయాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల నకిలీ మద్యం కొనుగోలు చేయకుండా ఉంటారు. లేదంటే వేలు పెట్టి కొని కాస్ట్లీ బాటిల్‌లో చీప్‌ లిక్కర్‌ తాగాల్సి వస్తుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి