ICICI Bank: ప్రైవేట్ రంగంలోని దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త ప్రకటించింది. సీనియర్ సిటిజన్ల(Senior Citizens) కోసం ప్రవేశపెట్టిన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువును పొడిగిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇందులో భాగంగా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై(Fixed Deposits) ప్రత్యేకమైన వడ్డీరేట్లను సీనియర్ సిటిజన్ల కోసం అందిస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా సీనియర్ సిటిజన్లకు అందించే 0. 50 శాతం వడ్డీరేటుకు అదనంగా మరో 0.25 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ స్కీమ్ జనవరి 20నే ముగియాల్సి ఉండగా దానిని ఏప్రిల్ 8 వరకు పొడిగిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా.. మరోసారి ఎఫ్‌డీ స్కీమ్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. దీంతో ఈ స్కీమ్ సినీయర్ సిటిజన్లకు మరో 5 నెలల పాటు అందుబాటులో ఉండనుంది.
ఈ వడ్డీ రేట్లు కొత్తగా ఓపెన్ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కూడా వర్తిస్తాయి. దాంతో పాటుగా పాత ఫిక్స్‌డ్ డిపాజిట్లను రెన్యూవల్ చేసుకున్నవారికి కూడా కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐసీఐసీఐ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక పథకం 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది సాధారణ ఖాతాదారులకు అందించే 5.60 శాతం కంటే ఎక్కువగా ఉంది.
ఇవీ చదవండి..
WhatsApp: టెక్స్ట్ మెసేజ్ లు అక్కర్లేదు.. ఎమోజీలు చాలు..! వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్..