ICICI Bank FD scheme: సీనియ‌ర్ సిటిజ‌న్లకు గుడ్ న్యూస్.. అధిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఐసీఐసీఐ..

|

Mar 14, 2021 | 8:58 PM

ICICI Bank: బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేయాలనుకునేవారికి ఐసీఐసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం 'ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ' ట‌ర్మ్ ఫిక్స్‌డ్ డిపాజిట్...

ICICI Bank FD scheme: సీనియ‌ర్ సిటిజ‌న్లకు గుడ్ న్యూస్.. అధిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఐసీఐసీఐ..
Icici Bank Golden Years Fd
Follow us on

ICICI Bank Golden Years FD Scheme: బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేయాలనుకునేవారికి ఐసీఐసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ‘ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ’ ట‌ర్మ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఓ పథకాన్ని ప్రారంభించింది. అధిక వ‌డ్డీరేటును అందించే ఈ ప్ర‌త్యేక‌మైన ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కాన్ని మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు అమ‌లులో ఉంటాయి.

దీర్ఘ కాలిక స్థిర‌త్వమే ప్రధానంగా ఉండే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఐడియ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప‌ర్చునిటీ కానుంది. వీరికి అద‌న‌పు బెనిఫిట్లు కూడా ఉంటాయి. ఈ ప‌థ‌కం కింద డిపాజిట్ చేసేవారికి ఐసీఐసీఐ అందించే వ‌డ్డీరేట్లు వేరుగా అందిస్తోంది. అవేంటో ఓ సారి ఇక్కడ చూద్దాం…

ఐసీఐసీఐ బ్యాంకులో 6.30 శాతం వ‌డ్డీ

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌త్యేకంగా రూపొందించిన ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయ‌ర్స్ ఎఫ్‌డీ స్కీమ్ కింద డిపాజిట్ చేసే వారికి 6.30 శాతం వ‌డ్డీరేటు అందిస్తున్న‌ది. ఈ పథకంలో సాధారణ వడ్డీ రేటుకంటే చేరేవారికి 0.8 శాతం అధనంగా వడ్డీ రేటు చెల్లిస్తున్నారు.

స్పెషల్ ఆఫర్..

గతంలో సీనియ‌ర్ సిటిజ‌న్లకు ఆఫర్ చేసిన వడ్డీ కన్నా ఇది 0.3 శాతం వడ్డీ అదనంగా  అదిస్తున్నారు. సాధారణ ప్రజలకు అందించే డిపాజిట్ వడ్డీ రేట్లతో పోల్చితే 0.8 శాతం ఎక్కవగా ఇస్తున్నారు. ఇందు‌లో 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 ఏళ్ల వరకు కాల వ్యవధితో కనీస మొత్తం 10 వేల నుంచి రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

లోన్ & క్రెడిట్ కార్డ్ సౌకర్యం…

ఈ పథకంలో చేరినవారికి డిపాజిట్‌పై  90 శాతం వరకు లోన్ పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా  సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ కూడా అందిస్తోంది.  ఆసక్తి గల కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ‘ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ’ పథకంలో చేరొచ్చు. ఇలా కాకుంటే మీకు సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో సంప్రదించి మరిన్ని వివరాలకు తెలుసుకోవచ్చు. ఇక ఈ స్కీమ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…www.icicibank.com

ఇవి కూడా చదవండి…

Today Gold Price : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

కొత్తగా కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. రూ. 1 లక్ష వరకు తగ్గింపు.!! వివరాలివే.!