కారు అనేది మధ్యతరగతి ప్రజల కల. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో హ్యాపీగా బయటకు వెళ్లాలనుకునే చాలా మంది కార్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మధ్యతరగతి ప్రజల కలను సాకారం చేస్తూ ఇండియన్ కంపెనీ టాటా తక్కువ ధరకే అధిక ఫీచర్లతో కార్లను అందిస్తుంది. టాటా కంపెనీ తాజాగా తన ఐసీఈ లైనప్‌లో జూన్ 2023 కోసం తన ఆఫర్ల సెట్‌ను విడుదల చేసింది. అయితే ఈ ఆఫర్లు మాత్రం ఈవీ వాహనాలకు వర్తించవు. ముఖ్యంగా నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు వంటి ఎన్నో ఆఫర్లను టాటా కంపెనీ వినియోగదారులకు అందిస్తుంది. టాటా టిగోర్, టియాగో, హారియర్, సఫారిచ, ఆల్ట్రోజ్ కార్లపై టాటా కంపెనీ భారీ డిస్కౌంట్‌ను అందిస్తుంది. రూ.15,000 నుంచి రూ.58,000 వరకూ ఈ ఆఫర్ల ద్వారా కొనుగోలుదారులు లబ్ధి పొందుతారు. జూన్‌లో టాటా కార్లపై వచ్చే ఆఫర్లు ఏంటో ఓ సారి తెలుసకుందాం.
ఈ కార్‌పై టాటా కంపెనీ రూ.58,000 తగ్గింపును అందిస్తుంది. కేవలం ఈ ఆఫర్ సీఎన్జీ కార్ మోడల్ పైనే ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సాధారణ పెట్రోల్ వేరియంట్‌పై కేవలం రూ.20,000 తగ్గింపు లభిస్తుంది. ఈ కార్ ధర రూ.6.30 లక్షల నుంచి రూ.8.90 లక్షల వరకూ ఉంటుంది. ఈ కార్‌పై రూ.35,000 నగదు తగ్గింపు, అలాగే రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్, మరో రూ.10,000 అదనపు ఎక్స్చేంజ్ బోనస్, రూ.3000 వరకూ కార్పొరేట్ తగ్గింపు వెరశి రూ.58,000 తగ్గింపు లభిస్తుంది.
ఈ కార్‌పై టాటా కంపెనీ రూ.53,000 తగ్గింపును అందిస్తుంది. కేవలం ఈ ఆఫర్ సీఎన్జీ కార్ మోడల్ పైనే ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్ ధర రూ.5.60 లక్షల నుంచి రూ.8.11 లక్షల వరకూ ఉంటుంది. ఈ కార్‌పై రూ.30,000 నగదు తగ్గింపు, అలాగే రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్, మరో రూ.10,000 అదనపు ఎక్స్చేంజ్ బోనస్, రూ.3000 వరకూ కార్పొరేట్ తగ్గింపు వెరశి రూ.53,000 తగ్గింపు లభిస్తుంది.
ఈ కార్‌పై రూ.10,000 ఎన్ఈసీ తగ్గింపు లభిస్తుంది. ఈ కార్ ధర రూ.6 లక్షల నుంచి 9.52 లక్షల వరకూ ఉంటుంది.
ఈ కార్‌పై టాటా కంపెనీ రూ.45,000 తగ్గింపును అందిస్తుంది. కేవలం ఈ ఆఫర్ డీజిల్ వేరియంట్లపై అందిస్తుంది. ఈ కార్ ధర రూ.6.60 లక్షల నుంచి రూ.10.74 లక్షల వరకూ ఉంటుంది. అయితే ఈ కార్లో ఎక్స్ఈ, ఎక్స్ఈ ప్లస్ తగ్గింపు కేవలం రూ.30,000 పరిమితం చేశారు. ఈ కార్‌పై రూ.15,000 నగదు తగ్గింపు, అలాగే రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్, మరో రూ.15,000 అదనపు ఎక్స్చేంజ్ బోనస్, రూ.5000 వరకూ కార్పొరేట్ తగ్గింపు వెరశి రూ.45,000 తగ్గింపు లభిస్తుంది.
ఈ కార్‌పై టాటా కంపెనీ రూ.20,000 తగ్గింపును అందిస్తుంది. కేవలం ఈ ఆఫర్ డీజిల్ వేరియంట్ మోడల్ పైనే ఉంటుంది. ఈ కార్కు ఎలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్లు రావు. ఈ కార్ ధర రూ.7.80 లక్షల నుంచి రూ.14.35 లక్షల వరకూ ఉంటుంది. ఈ కార్‌పై రూ.15,000 నగదు తగ్గింపు, అలాగే రూ.5000 వరకూ కార్పొరేట్ తగ్గింపు వెరశి రూ.20,000 తగ్గింపు లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..