Business Idea: జన్‌ ఔషధి కేంద్రం ఎలా ఏర్పాటు చేసుకోవాలి.? ఎంత ఖర్చవుతుంది.? ప్రాసెస్ ఏంటి.?

|

Nov 03, 2023 | 11:59 AM

'ప్రధాన మంత్రి భారతీయ జన్‌ ఔషధి కేంద్రం' పేరుతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ షాప్స్‌ ద్వారా తక్కువ ధరకే ప్రజలకు మందులు లభిస్తున్నాయి. ఇంతకీ ఈ జన్‌ ఔషధి కేంద్రాలను ఏలా ఏర్పాటు చేసుకోవాలి.? ఎంత లాభం ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 9400కిపైగా జన్‌ ఔషధి కేంద్రాలు ప్రారంభించార. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం...

Business Idea: జన్‌ ఔషధి కేంద్రం ఎలా ఏర్పాటు చేసుకోవాలి.? ఎంత ఖర్చవుతుంది.? ప్రాసెస్ ఏంటి.?
Jan Aushadhi Kendra
Follow us on

ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగం కంటే వ్యాపారానికే జై కొడుతున్నారు. వినూత్న ఆలోచనలతో వ్యాపారం చేస్తున్నారు. ఇక ఎవర్‌ గ్రీన్ బిజినెస్‌లలో మెడికల్ రంగం ముఖ్యమైంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జన్ ఔషధి కేంద్రాలు యువతకు మంచి వ్యాపార అవకాశంగా మారాయి.

‘ప్రధాన మంత్రి భారతీయ జన్‌ ఔషధి కేంద్రం’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ షాప్స్‌ ద్వారా తక్కువ ధరకే ప్రజలకు మందులు లభిస్తున్నాయి. ఇంతకీ ఈ జన్‌ ఔషధి కేంద్రాలను ఏలా ఏర్పాటు చేసుకోవాలి.? ఎంత లాభం ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 9400కిపైగా జన్‌ ఔషధి కేంద్రాలు ప్రారంభించార. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త జన్‌ ఔషధి కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కేంద్రాల్లో 1800 రకాల మందులు, 285 వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇతర మందులతో పోలిస్తే జన్‌ ఔషధి కేంద్రాల్లో 50 నుంచి 90 శాతం వరకు మందులు తక్కువ ధరకు లభిస్తాయి.

ప్రధాన మంత్రి జన్‌ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ. 5వేలు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాలి. ఇక దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా డీ ఫార్మా లేదా బీ ఫార్మా సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. జన్‌ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడ స్థలం ఉండాలి. కనీసం 120 చదరపు అడుగుల విస్తీర్ణ స్థలం ఉండాలి. ఇదిలా ఉంటే జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. రూ. 5 లక్షల వరకు సాయం అందిస్తుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే…

జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకునే వారి వద్ద ఆధార్‌ కార్డ్‌, ఫార్మసిస్ట్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, పాన్‌కార్డ్‌, మొబైల్ నెంబర్‌, నివాస ధృవీకరణ పత్రం ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా janaushdhi.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం అప్లై ఫర్‌ కేంద్ర అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం సైన్‌ ఇన్‌ ఫామ్‌ ఓపెన్ అవుతుంది. దాని కింద రిజిస్టర్‌ నౌ ఆప్ఫన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. వెంటనే రిజిస్ట్రేషన్‌ ఫామ్‌ ఓపెన్‌ అవుతుంది. ఫామ్‌లో అవసరమైన సమాచారాన్ని ఎంటర్‌ చేయాలి. తర్వాత రాష్ట్రాన్ని ఎంచుకొని, ఐడీ పాస్‌వర్డ్ విభాగంలో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. చివరిగా టర్మ్‌ అండ్‌ కండిషన్స్‌పై క్లిక్‌ చేసి సబ్‌మిట్ నొక్కితో ఆన్‌లైన్‌ ధృవీకరణ ప్రక్రియ పూర్తయినట్లే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..