SSY: కూతురు వివాహ సమయానికి రూ. 35 లక్షలు పొందాలంటే.. నెలకు ఎంత సేవింగ్‌ చేయాలంటే..

ఈ పథకంలో ప్రతీ నెల కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టుకుంటూ పోతే పిల్లల చదువులు లేదా వివాహా సమయానికి డబ్బులు రిటర్న్‌ పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా సెక్యూరిటీతో పాటు మంచి రిటర్న్స్‌ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ట్యాక్స్‌ మినహాయింపు వంటి బెనిఫిట్స్‌ కూడా ఉంటాయి..

SSY: కూతురు వివాహ సమయానికి రూ. 35 లక్షలు పొందాలంటే.. నెలకు ఎంత సేవింగ్‌ చేయాలంటే..
Sukanya Samriddhi Yojana
Follow us

|

Updated on: Jun 08, 2024 | 3:38 PM

తమ చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్క పేరెంట్‌ ఎన్నో కలలు కంటారు. అందుకోసం డబ్బు పొదుపు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆడబిడ్డ జన్మిస్తే ఓవైపు పై చదువులతో పాటు పెళ్లి కోసం కూడా ఆలోచిస్తుంటారు. ఆడబిడ్డ పెళ్లి ఖర్చులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ఉంటారు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ పథకంలో ప్రతీ నెల కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టుకుంటూ పోతే పిల్లల చదువులు లేదా వివాహా సమయానికి డబ్బులు రిటర్న్‌ పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా సెక్యూరిటీతో పాటు మంచి రిటర్న్స్‌ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ట్యాక్స్‌ మినహాయింపు వంటి బెనిఫిట్స్‌ కూడా ఉంటాయి. మరి కూతురు వివాహ సమయానికి రూ. 35 లక్షలు రావాలంటే ఈ పథకంలో నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదాహరణకు మీరు మీ కూతురు వివాహ సమయానికి రూ. 35 లక్షలు రిటర్న్స్‌ రావాలనుకుంటే ప్రతీ నెలా రూ. 6250 చొప్పున 15 ఏళ్లు పెట్టుబడి పెడుతూ పోవాలి. ఈ పథకం కింద 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. వడ్డీ ఏడాదికి ఒకసారి యాడ్ అవుతుంది. పదేళ్లలోపు ఆడబిడ్డ పేరుపై తల్లిదండ్రులు ఈ అకౌంట్‌ను ఓపెన్‌ చేయొచ్చు. ఇందులో నెలకు కనీసం పెట్టుబడి రూ. 250 కాగా, గరిష్టంగా ఎంతైనా పెట్టుబడిగా పెట్టుకోచ్చు. నెలకు లేదా ఏడాదికి ఒకసారి కూడా డబ్బులు డిపాజిట్‌ చేయొచ్చు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక ఈ అకౌంట్ ఓపెన్‌ చేసిన తర్వాత అమ్మాయి వయసు 21 ఏళ్లు నిండితే లేదా అమ్మాయి పెళ్లి జరిగినా అకౌంట్ క్లోజ్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్