
సొంత ఇంటి కల సాకారం చేసుకోవడానికి మెజారిటీ మధ్యతరగతి ప్రజలు హోమ్ లోన్‌పైనే ఆధారపడుతుంటారు. అయితే 20 నుంచి 25 ఏళ్ల పాటు నెలనెలా ఈఎంఐలు కట్టడమంటే జీవితంలో అధిక భాగం అప్పుల ఊబిలోనే గడపాల్సి వస్తుందనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. కానీ సరైన ఆర్థిక క్రమశిక్షణ, ముందస్తు ప్రణాళిక పాటిస్తే 20 ఏళ్ల గృహ రుణాన్ని కేవలం 10 నుంచి 12 ఏళ్లలోనే పూర్తిగా తీర్చివేయడమే కాకుండా, లక్షల రూపాయల వడ్డీని ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 8.5శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ.30 లక్షల హోమ్ లోన్‌ను 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకున్నారనుకుందాం.. అప్పుడు ఈఎంఐ ఇలా
అంటే తీసుకున్న అసలు కంటే బ్యాంకుకు చెల్లించే వడ్డీయే ఎక్కువ. అయితే చిన్నపాటి వ్యూహాలతో ఈ భారీ వడ్డీ భారాన్ని ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.
ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో రెగ్యులర్ 12 ఈఎంఐలతో పాటు అదనంగా మరో ఈఎంఐ నేరుగా అసలు కింద జమ చేయండి. కేవలం ఈ ఒక్క పని చేయడం వల్ల మీ 20 ఏళ్ల లోన్ దాదాపు 16-17 ఏళ్లకే ముగుస్తుంది; లక్షల రూపాయల వడ్డీ ఆదా అవుతుంది.
కెరీర్‌లో వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సాధారణం. ప్రతి సంవత్సరం మీ వార్షిక ఆదాయం పెరిగినప్పుడు, మీ ఈఎంఐ మొత్తాన్ని కూడా 5శాతం నుండి 10శాతం వరకు పెంచండి లేదా అదనపు ఈఎంఐల సంఖ్యను పెంచుతూ వెళ్లండి. దీనివల్ల లోన్ కాలపరిమితి ఏకంగా సగానికి తగ్గిపోతుంది.
కంపెనీ ఇచ్చే వార్షిక బోనస్, పన్ను రీఫండ్‌లు , లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల మెచ్యూరిటీ వంటి అదనపు మొత్తాలు చేతికి వచ్చినప్పుడు వాటిని ఖర్చు చేయకుండా నేరుగా లోన్ ప్రీ-పేమెంట్‌కు కేటాయించండి. హోమ్ లోన్ ప్రారంభ సంవత్సరాల్లో అసలు ఎంత తగ్గితే, మిగిలిన కాలానికి వడ్డీ భారం అంత వేగంగా పడిపోతుంది.
ప్రస్తుతం మీరు చెల్లిస్తున్న వడ్డీ రేటును మార్కెట్ రేట్లతో ఎప్పటికప్పుడు పోల్చి చూసుకోండి. మార్కెట్‌లో తక్కువ వడ్డీ లభిస్తుంటే, మీ ప్రస్తుత బ్యాంక్‌తో మాట్లాడి రేటు తగ్గించుకోవడం లేదా తక్కువ రేటు ఆఫర్ చేసే ఇతర బ్యాంకులకు లోన్ బదిలీ చేయడం ప్రయోజనకరం.
ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉన్న వ్యక్తిగత గృహ రుణాలపై ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రీ-పేమెంట్ లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఉండవు. కాబట్టి ఎప్పుడు అదనపు మొత్తం ఉన్నా బ్యాంకును సంప్రదించి, ఆ మొత్తాన్ని ‘లోన్ ప్రిన్సిపల్’కు జమ చేయమని స్పష్టంగా పేర్కొనడం ద్వారా రుణ విముక్తిని వేగవంతం చేసుకోవచ్చు.