
గత కొన్ని వారాల నుంచి మార్కెట్లో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. దీంతో బంగారం, వెండిలో కల్తీ జరుగుతున్న కేసులు కూడా కొన్ని చోట్ల బయటకొస్తున్నాయి. అందుకే ఆభరణాలు కొనుగోలు చేసే విషయంలో ప్రజల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వెండిలో జరిగే కల్తీ గుర్తించలేని విధంగా ఉంటుంది. అసలు వెండిలో ఎలా కల్తీ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మార్కెట్లో లభించే వెండిలో కొంత రాగి కలుస్తుంది. అప్పుడే అది దృఢంగా ఉండగలదు. అయితే రాగికి బదలుగా మరికొన్ని మిశ్రమాలను కలుపి వెండిని కల్తీ చేస్తున్నారు కొందరు వ్యాపారులు. వెండిలో రాగి సరైన నిష్పత్తిలో ఉంటేనే అది హాల్‌మార్కింగ్‌కు అర్హత సాధిస్తుంది. ఆ నిష్పత్తి అటు ఇటు అయితే అది కల్తీ వెండి కింద లెక్క. అసలైన వెండినలో 92.5 గ్రాముల స్వచ్ఛమైన వెండి ఉంటుంది. మిగిలిన భాగం రాగి వంటి ఇతర లోహాల మిశ్రమం కలుపుతారు. ఇవి ఆభరణాలను గట్టిగా, మన్నికగా ఉండేందుకు తోడ్పడతాయి. అయితే లోకల్ మార్కెట్లో చాలామంది జ్యువెలర్లు ఇతర లోహాల మిశ్రమాన్ని ఎక్కువ కలిపి కల్తీ చేస్తున్నారు. కల్తీ వెండి త్వరగా పాడైపోతుంది. రంగు కూడా త్వరగా పోతుంది. అందుకే వెండి కొనే ముందు స్వచ్ఛతను గుర్తించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి