Power Bill: కరెంట్ బిల్లు ఎలా లెక్కిస్తారు..? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ నెల బిల్లు ఎంతో మీరే తెలుసుకోవచ్చు..

మీ కరెంట్ బిల్లు తప్పుగా వచ్చిందనే అనుమానం మీకు ఉందా..? వాడిన కరెంట్ కంటే ఎక్కువ బిల్లు వేశారనే డౌట్ ఉందా.. అయితే మీరు టెన్షన్ పడనక్కర్లేదు. మీ కరెంట్ బిల్లును మీరే లెక్కించుకోవచ్చు. దీని వల్ల మీ అనుమానం తొలగిపోతుంది. కరెంట్ బిల్లు ఎలా లెక్కించాలనేది తెలుసుకుందాం.

Power Bill: కరెంట్ బిల్లు ఎలా లెక్కిస్తారు..? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ నెల బిల్లు ఎంతో మీరే తెలుసుకోవచ్చు..
Power Bill

Updated on: Nov 07, 2026 | 12:02 PM

ప్రతీ నెలా మీ మీటర్ రీడింగ్ లెక్కించి విద్యుత్ పంపిణీ సంస్థలు మీకు కరెంట్ బిల్లు అందిస్తాయి. గడువులోగా ఈ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే పవర్ కట్ చేసే అవాకాశముంటుంది. అలాగే జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుంది. అయితే కొంతమందికి కరెంట్ బిల్లుపై అనేక అనుమానాలు ఉంటాయి. తాము వాడిన విద్యుత్ కంటే బిల్లు ఎక్కువగా వచ్చిందనే డౌన్ పడుతుంటారు. తమ బిల్లును తామే ఎలా లెక్కించుకోవాలో తెలియక అధికారులను సంప్రదించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇందుకోసం సమీపంలోని సబ్ స్టేషన్‌కు వెళ్లడం లేదా విద్యుత్ అధికారులతో మాట్లాడటం చేస్తుంటారు. కానీ నిజానికి కరెంట్ బిల్లును టెలిస్కోపిక్ స్లాబ్ సిస్టమ్ ద్వారా లెక్కిస్తారు. ఇది ఎలా అనేది తెలుసుకుంటే మీ మీటర్ రీడింగ్ చూసి మీ నెలవారీ కరెంట్ బిల్లు ఎంత వస్తుందనేది మీరే సులువుగా ఇంటి వద్ద లెక్కించుకోవచ్చు.

ఒక యూనిట్ అంటే ఎంత..?

కరెంట్ బిల్లును మీరు లెక్కించాలంటే.. ముందుగా కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. తొలుత యూనిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకు ఒక పవర్ రేటింగ్ ఉంటుంది. దీనిని వాట్స్‌గా పిలుస్తారు. మీ ఇంట్లో ఉండే కరెంట్ మీటర్ మీరు ఉపయోగించే విద్యుత్‌ను కిలోవాట్ అవర్ (kWh)లో లెక్కిస్తుంది. 1 కిలోవాట్ అవర్‌నే ఒక యూనిట్‌గా పిలుస్తారు. ఉదాహరణకు మీరు 1000 వాట్ల గల ఇస్త్రీ పెట్టె లేదా గీజర్ ఒక గంటపాటు ఉపయోగిస్తే ఒక యూనిట్ కరెంట్ ఖర్చువుతుంది. 100 వాట్స్ కలిగిన పరికరాన్ని 10 గంటల పాటు ఉపయోగిస్తే 1 యూనిట్ ఖర్చవుతుంది. తొలుత దీని గురించి మీకు అవగాహన ఉంటే కరెంట్ బిల్లు లెక్కించడంలో ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఏ వస్తువు ఎంత కరెంట్‌ను ఉపయోగిస్తుందో సులువుగా తెలుసుకోవచ్చు.

కరెంట్ బిల్లు ఎలా లెక్కిస్తారంటే..?

కరెంట్ బిల్లు ఎలా లెక్కిస్తారనే విషయానికొస్తే.. గత నెల మీకు అందించిన బిల్లులో యూనిట్ల సంఖ్య ఉంటుంది. ప్రస్తుతం మీ మీటర్ రీడింగ్‌ ఎన్ని యూనిట్లకు చేరుకుందో చెక్ చేయండి. ఈ నెల రీడింగ్ నుంచి గత నెల రీడింగ్ మైనస్ చేస్తే మీరు ఈ నెలలో ఎన్ని యూనిట్లు వాడారనేది తెలుస్తుంది. ఉదాహరణకు గత నెల బిల్లులో 1500 యూనిట్లుగా ఉందనుకుందాం.. ఈ నెల వచ్చేసరికి 1700కు చేరుకుందనుకుంటే.. 1700-1500 ప్రకారం లెక్కిస్తే మీరు 200 యూనిట్లు ఖర్చు చేసినట్లవుతుంది. మీ రాష్ట్రంలోని శ్లాబు రేట్ల ప్రకారం యూనిట్‌కు ఎంత ధర ఉందనేది తెలుసుని దానితో లెక్కిస్తే మీ నెల కరెంట్ బిల్లు ఎంత అనేది మీకు తెలుస్తుంది.

యూనిట్ల ప్రకారం ఛార్జీలు

అన్ని యూనిట్లకు ఒకే రకమైన ధర ఉండదు. మీరు వాడే కరెంటు పరిమాణాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి. 1 నుంచి 100 యూనిట్లకు రేటు తక్కువగా ఉంటుంది. మొదటి 50 యూనిట్ల వరకు యూనిట్‌కు దాదాపు రూ.1.50 నుండి రూ.2 లోపే ఉంటుంది. ఆ తర్వాత 51 నుండి 100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3 వరకు ఛార్జ్ చేస్తారు. 101-200 యూనిట్ల వరకు యూనిట్‌కు సుమారు రూ.4.50 నుండి రూ.5 వరకు పడుతుంది. 200 యూనిట్లు దాటితే స్లాబ్ రేట్లు మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో మీ రాష్ట్రంలో ఎన్ని యూనిట్లకు ఎంత ధరలు ఉన్నాయనేది తెలుసుకుని లెక్కించండి. దీనికి తోడు కస్టమర్ ఛార్జీలు, మీటర్ ఫిక్స్‌డ్ ఛార్జీలు, ప్రభుత్వం విధించే ఎలక్ట్రిసిటీ డ్యూటీ టాక్సులు కలిపితే మీ తుది కరెంట్ బిల్లు ఎంతనేది తెలుస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us