DMart: రూ.1000 లతో డీమార్ట్‌కు వెళ్తే.. నెలకు సరిపడా సరుకులు! చాలా మందికి తెలియని సింపుల్ ట్రిక్స్

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రూ.1000 బడ్జెట్‌తో డీమార్ట్‌లో ఏయే గ్రోసరీ వస్తువులు కొనుగోలు చేయాలో తెలుసుకోవడం ప్రతి కుటుంబానికి ఉపయోగకరం. సరైన షాపింగ్ ప్లాన్, అవసరమైన వస్తువుల జాబితా, స్మార్ట్ కొనుగోలు చిట్కాలతో తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయోజనం ఎలా పొందవచ్చో అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

DMart: రూ.1000 లతో డీమార్ట్‌కు వెళ్తే.. నెలకు సరిపడా సరుకులు! చాలా మందికి తెలియని సింపుల్ ట్రిక్స్
Dmart

Updated on: Jul 14, 2026 | 2:44 PM

రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబం ఖర్చును తగ్గించే మార్గాలను వెతుకుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ అవసరాలను తీర్చుకోవడానికి డీమార్ట్ వంటి రిటైల్ స్టోర్లు చాలామందికి మొదటి ఎంపికగా మారుతున్నాయి. సుమారు రూ.1000 బడ్జెట్‌తో ఒక చిన్న కుటుంబానికి అవసరమైన పలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా బియ్యం, పప్పులు, వంటనూనె, ఉప్పు, చక్కెర వంటి అత్యవసర వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలి. అనంతరం టీ పొడి, మసాలా పొడులు, సబ్బులు, డిటర్జెంట్ వంటి రోజువారీ వినియోగ వస్తువులను జాబితాలో చేర్చుకోవచ్చు. అవసరం లేని స్నాక్స్, కూల్‌డ్రింక్స్ లేదా ఆకర్షణీయమైన ఆఫర్లకు వెంటనే ఆకర్షితులు కాకుండా, ఇంటికి నిజంగా అవసరమైన వస్తువులనే కొనుగోలు చేయడం మంచిది.

లిస్ట్ రెడీ చేసుకోండి..

అయితే షాపింగ్‌కు వెళ్లే ముందు అవసరమైన వస్తువుల లిస్ట్‌ను పర్ఫెక్ట్‌గా జాబితాను సిద్ధం చేసుకోవడం, బడ్జెట్‌ను ముందుగానే నిర్ణయించుకోవడం, ఆఫర్ పేరుతో అవసరం లేని వస్తువులు కొనకుండా ఉండటం ద్వారా మరింత ఆదా చేయవచ్చు. అలాగే డీమార్ట్‌లో అందుబాటులో ఉండే స్టోర్ బ్రాండ్ ఉత్పత్తులను కూడా పరిశీలిస్తే కొన్నిసార్లు తక్కువ ధరలో మంచి నాణ్యతతో లభించే అవకాశం ఉంటుంది.

పిల్లలతో వెళ్లకపోవడం మంచిది..

చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే.. డీమార్ట్‌కు వెళ్లే సమయంలో తమతో పాటు చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్లారు. మరీ ముఖ్యంగా స్కూల్‌కి వెళ్తున్న పిల్లల్ని తీసుకెళ్తే వాళ్లు అక్కడ వారి కంటికి నచ్చిన వస్తువులు కొనమని మారం చేస్తారు. పిల్లలు అడుగుతున్నారు కదా అని మనం అవి అవసరం లేకపోయినా కొనుగోలు చేస్తుంటారు. తీరా బిల్లింగ్‌కు వెళ్లే సరికి మన బడ్జెట్ దాటి బిల్ అవుతుంది. సర్లే పిల్లల కోసం తప్పదు కదా అని కొనేస్తాం. ఇలా చేయడం వల్లే చాలా మందికి డీమార్ట్ బిల్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా, సరైన ప్రణాళికతో కొనుగోలు చేస్తే రూ.1000 బడ్జెట్‌లోనే ఇద్దరు ఉండే ఒక చిన్న కుటుంబానికి అవసరమైన పలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. ఇప్పుడు చెప్పిన లిస్ట్ కేవలం నిత్యావసరాలు మాత్రమే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us