
ఇంట్లోని కావాల్సిన నిత్యావసర వస్తువుల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఒకటి. ఇది లేకపోతే కిచెన్‌లో ఏ పని కూడా జరగదు. ఏది వండాలన్నా గ్యాస్ సిలిండర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. లేకపోతే చలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే చాలామంది రెండు సిలిండర్లను ఇంట్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒకదానిలో గ్యాస్ అయిపోగానే.. వెంటనే బుకింగ్ చేసి రెండోదానికి స్టాక్‌గా ఉంచుకుంటారు. గ్యాస్ అయిపోనప్పుడు వెంటనే దీనిని వాడుకోవచ్చు. అయితే ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉన్నవారు మాత్రం గ్యాస్ అయిపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే బుకింగ్ చేయగానే గ్యాస్ ఇంటికి రాదు. రెండు లేదా మూడు రోజుల వరకు సమయం పడుతుంది. ఇలాంటప్పుడు ఇంట్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక కొన్ని సమయాల్లో గ్యాస్ వెంటనే బుక్ కాదు. గ్యాస్ ఏజెన్సీ ఫోన్ నెంబర్‌ను వెతికి కాల్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫోన్ కనెక్ట్ కాక బుకింగ్ అవ్వదు.
గ్యాస్ వినియోగదారుల కోసం కంపెనీలు వాట్సప్ సేవలను అందిస్తున్నాయి. జస్ట్ వాట్సప్ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేస్తే చాలు.. పేమెంట్ చేసి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల ఫోన్ నెంబర్ వెతికి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ వాట్సప్ ఫీచర్ వల్ల సెకన్లలోనే గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. దాదాపు అన్ని గ్యాస్ కంపెనీలు ఈ వాట్సప్ మెస్సేజ్ గ్యాస్ బుకింగ్ ఫెసిలిటీ అందిస్తున్నాయి. ఆయా గ్యాస్ కంపెనీల వాట్సప్ నెంబర్‌కు మెస్సేజ్ చేయడం ద్వారా సులువుగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.
-భారత్ గ్యాస్(Bharat Gas) – 1800224344
-ఇండేన్ గ్యాస్ (Indane Gas) – 7588888824
-హెచ్‌పీ గ్యాస్(HP Gas) – 9222201122
-మొబైల్‌లో మీ గ్యాస్ కంపెనీ నెంబర్‌ను సేవ్ చేసుకోండి
-వాట్సప్ ఓపెన్ చేసి గ్యాస్ కంపెనీల వాట్సప్ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ పెట్టండి
-మీ లాంగ్వేజ్‌ను ఎంచుకోండి
-మోనూలో గ్యాస్ రీఫిల్ ఆప్షన్ ఎంచుకోండి
-ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయండి
-ఆఫ్‌లైన్ ద్వారా అయితే క్యాష్ ఆన్ డెలివరీ సెలక్ట్ చేసుకోండి
-గ్యాస్ కనెక్షన్‌తో బుక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే వాట్సప్ మెస్సేజ్ పెట్టాలి