Apple CEO: 15 ఏళ్ల తర్వాత కీలక మార్పు.. ఆపిల్‌కు కొత్త సీఈవో.. ఆస్తి, జీతం ఎంతో తెలుసా?

Apple CEO: జాన్ టర్నస్ పేరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా, యాపిల్ సంస్థలో ఆయన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. 1997లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. కెరీర్ విషయానికొస్తే.. ప్రారంభంలో 'వర్చువల్ రీసెర్చ్ సిస్టమ్స్'లో పనిచేసి, 2001లో యాపిల్‌లో చేరారు.

Apple CEO: 15 ఏళ్ల తర్వాత కీలక మార్పు.. ఆపిల్‌కు కొత్త సీఈవో.. ఆస్తి, జీతం ఎంతో తెలుసా?
Apple Ceo

Updated on: Apr 21, 2026 | 12:18 PM

Apple CEO: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉన్న యాపిల్ (Apple) లో ఒక శకం ముగియబోతోంది. గత 15 ఏళ్లుగా కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు తీసుకెళ్లిన టిమ్ కుక్, తన సీఈఓ (CEO) పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన స్థానంలో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ దిగ్గజం జాన్ టర్నస్ (John Ternus) బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎప్పటి నుంచి బాధ్యతలు చేపడతారు?

జాన్ టర్నస్ సెప్టెంబర్ 1, 2026 నుండి యాపిల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటివరకు సీఈఓగా ఉన్న 65 ఏళ్ల టిమ్ కుక్, ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొత్త పాత్రలో కొనసాగుతారు. అమెరికన్ వ్యాపార చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నాయకత్వ మార్పుల్లో ఇది ఒకటిగా నిలవనుంది.

ఇవి కూడా చదవండి

ఎవరీ జాన్ టర్నస్?

జాన్ టర్నస్ పేరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా, యాపిల్ సంస్థలో ఆయన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. 1997లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. కెరీర్ విషయానికొస్తే.. ప్రారంభంలో ‘వర్చువల్ రీసెర్చ్ సిస్టమ్స్’లో పనిచేసి, 2001లో యాపిల్‌లో చేరారు.

ఇది కూడా చదవండి: Silver Price: వెండి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన సిల్వర్‌

యాపిల్ ఐఫోన్ (iPhone), ఐప్యాడ్ (iPad), మ్యాక్ (Mac) వంటి కీలక ఉత్పత్తుల హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగం హెడ్‌గా పనిచేశారు. 50 ఏళ్ల టర్నస్, యాపిల్ చరిత్రలో 8వ సీఈఓగా రికార్డు సృష్టించనున్నారు.

జాన్ టర్నస్ నికర ఆస్తి:

సుమారు 20 ఏళ్లకు పైగా యాపిల్‌లో పనిచేసిన టర్నస్, తన కెరీర్‌లో భారీగానే సంపాదించారు. నికర ఆస్తి.. సెలబ్రిటీ నెట్ వర్త్ ప్రకారం, ఆయన ఆస్తి సుమారు 75 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.630 కోట్లు) ఉంటుందని అంచనా. ఈ సంపదంతా కూడా ఆయన జీతం, బోనస్‌లు, స్టాక్ కాంపెన్సేషన్ ద్వారా లభించింది.

అయితే జాన్ టెర్నస్ జీతం గురించి ఇప్పటివరకు ఎలాంటి పబ్లిక్ డేటా లేదు. అయితే ఆపిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌గా ఆయనకు భారీ స్థాయిలో మంచి శాలరీ వస్తుంది. బోనస్, స్టాక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు వార్షిక జీతం కోట్లలో ఉంటుంది. స్టాక్ బెనిఫిట్స్‌తో పాటు పనికి తగిన బోనస్‌లు ఉంటాయి. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆదాయం టిమ్ కుక్ స్థాయికి (ఏడాదికి దాదాపు రూ.600 కోట్లు) పెరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: DMart ఏప్రిల్ 4వ వారం మెగా ఆఫర్లు.. 80% వరకు డిస్కౌంట్.. బై వన్ గెట్ వన్ ఫ్రీ డీల్స్‌తో కస్టమర్లకు పండుగ!

టిమ్ కుక్ సంపాదన ఎంత?

ఫోర్బ్స్ ప్రకారం, టిమ్ కుక్ నికర ఆస్తి సుమారు 2.53 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.21,000 కోట్లు). గత 28 ఏళ్లుగా ఆయనకు ఉన్న యాపిల్ షేర్ల వల్లే ఈ స్థాయిలో ఆస్తి కూడింది. 2024లో ఆయన సుమారు 74.6 మిలియన్ డాలర్ల (రూ.625 కోట్లు) వార్షిక ప్యాకేజీని అందుకున్నారు..

ఇది కూడా చదవండి: Silver Price Crash: వెండి ధరల్లో పెను పతనం? కిలో వెండి లక్షకు చేరుతుందా? మార్కెట్‌లో ప్రకంపనలు.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us