హర్మూజ్ నుంచి భారత్‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా! ఈ రూట్‌లో డైలీ ఎన్ని వెళ్తాయంటే

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు స్టేర్ట్ ఆఫ్‌ హర్మూజ్ వైపే చూస్తుంది. ఎందుకంటే ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల మధ్య రాకపోకలకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంది మూతబడింది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు రావాల్సిన చమురు నౌకలు మొదట్లో అక్కడే ఆగిపోయాయి. భారత్‌ చర్చల తర్వాత ఆ షిప్స్‌ ఇండియాకు చేరుకున్నాయి. అయితే ఒక చమురు నౌక హ్మరోజ్‌ నుంచి భారత్‌ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసా? ఆ నౌకలకు ఎవరు రక్షణ కల్పిస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే తెలుసుకుందాం పదండి.

హర్మూజ్ నుంచి భారత్‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా! ఈ రూట్‌లో డైలీ ఎన్ని వెళ్తాయంటే
Strait Of Hormuz

Updated on: Apr 10, 2026 | 4:46 PM

స్టేర్ట్‌ ఆఫ్ హర్మూజ్.. ఇది ప్రపంచ దేశాలకు మధ్య రాకపోకలకు అనువుగా ఉన్న ఏకౌక సముద్రం మార్గం. దీని ద్వారానే భారత్ సహా అనేక దేశాలకు అవసరమైన చమురు, గ్యాస్ సరఫరా అవుతుంది.అయితే ఈ జలసంధి నుండి గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు దూరం సుమారు 1,000 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ముంబై పోర్ట్‌కు దాదాపు 1,550 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే వాతావరణం, లోడ్ , మార్గాన్ని బట్టి ఈ ప్రయాణానికి 2 నుండి 3 రోజులు పట్టవచ్చు కొన్ని సార్లు హర్మూజ్ నుంచి ఒక షిప్‌ ఇండియాలోని ఈ పోర్ట్‌లకు చేరుకోవడానికి రెండు నుండి మూడు రోజులు సమయం పట్టవచ్చు. ఎందుకంటే ఈ నౌకలు పెద్దవిగా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా కదులుతాయి. కానీ అరేబియా సముద్రంలో మాత్రం ఇవి స్థిరమైన వేగంతో ప్రయాణిస్తాయి.

అయితే చమురు ట్యాంకర్లు సాధారణంగా గంటకు 24 నుండి 31 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంటే సగటున గంటకు 27.78 కిలోమీటర్ల వేగంతో, ఒక ట్యాంకర్ కాండ్లా పోర్టుకు చేరుకోవడానికి సుమారు 37 గంటలు అంటే దాదాపు ఒకటిన్నర రోజు పడుతుంది. అదే ముంబై పోర్టుకు చేరుకోవడానికి సుమారు 53 గంటలు అంటే రెండు రోజులకు పైగా పడుతుంది.

హోర్ముజ్ జలసంధిలో రవాణాను ఎవరు నియంత్రిస్తారు?

హార్ముజ్ జలసంధి ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉంది. ఇది కేవలం 21-33 21-33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం నౌకల రాకపోకలు సాగుతున్నప్పటికీ, స్థానికంగా ఆచరణలో ఉత్తర భాగాన్ని ఇరాన్, దక్షిణ భాగాన్ని ఒమన్ పర్యవేక్షిస్తాయి. ఈ జలసంది గుండా వెళ్లే నౌకల భద్రతను ఇరాన్, ఓమన్‌తో పాటు అమెరికాకు చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ కూడా పర్యవేక్షిస్తుంది. సాధారణ రోజుల్లో రోజుకు 80-130 నౌకలు ఈ మార్గం గుండా వెళ్తుంటాయి. అయితే ఏవైనా ఉద్రిక్తలు తలెత్తినప్పుడు ఇరాన్ ఈ మార్గాన్ని తన ఆదినంలోకి ఉంచుకోవచ్చు.

భారతదేశ ఇంధన జీవనాధారం

హార్ముజ్ జలసంధి భారత ఇంధన భద్రతకు అత్యంత కీలక మార్గం. ఇక్కడ సరఫరా ఆగిపోతే దేశంలో పెట్రోల్ ధరలు పెరగడమే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఒకవేళ పరిస్థితి విషమిస్తే, చాబహార్ పోర్ట్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను భారత్‌ ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇండియన్‌ నేవి ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే మన నౌకలకు రక్షణ కవచంగా పనిచేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us