
ప్రతీఒక్కరి వంటిట్లో గ్యాస్ సిలిండర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. కొంతమంది సింగిల్ సిలిండర్ వాడితే.. మరికొంతమంది రెండు సిలిండర్లు ఉంచుకుంటారు. ఒక సిలిండర్ ఖాళీ అవ్వగానే పెట్టుకునేందుకు రెండో సిలిండర్ స్టాక్‌గా పెట్టుకుంటారు. అయితే భద్రత కారణాల దృష్ట్యా ఇంట్లో ఎక్కువ ఉంచుకోవాడినికి వీల్లేదు. ఇందుకు నిబంధనలు అంగీకరించవు. ఎక్కువ నిల్వ చేసుకుంటే అధికారులు మీపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జైలుశిక్ష కూడా పడొచ్చు. నిబంధనల ప్రకారం ఇంట్లో ఎన్ని సిలిండర్లు ఉంచుకోవచ్చు..? ఎక్కువ నిల్వ చేసుకుంటే ఎలాంటి చర్యలు ఉంటాయి..? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లను ఉంచుకోవచ్చు. ఒకటి వంటకు ఉపయోగిస్తుంటే.. మరొకదానికి స్పేర్ కూడా ఉంచుకోవచ్చు. కానీ చాలామంది అంతకంటే ఎక్కువ సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడితే మీకు ఇబ్బందులు ఎదురుకావొచ్చు. రెండు కంటే ఎక్కువ ఉంచుకోవాలంటే ప్రత్యేక అనుమతి అవసరం పడుతుంది. ఎల్పీజీ సిలిండర్లు మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు పేలితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో భద్రతాపరమైన కారణాల వల్ల కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి. రెండు కంటే ఎక్కువ సిలిండర్లను ఉంచుకోవద్దని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ఒక నిర్టిష్ట సంఖ్యకు మంచి సిలిండర్లను నిల్వ చేసుకోవాలంటే స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. స్థానిక అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్లకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. మీరు నిబంధనలకు మించి నిల్వ చేసుకుంటే చట్ట విరుద్దంగా భావిస్తారు. అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో ఇన్యూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో సమస్యలు రావొచ్చు. మీరు అదనపు సిలిండర్లను నిల్వ చేసుకోవాలంటే గ్యాస్ ఏజెన్సీ నిబంధనలను పరిశీలించాలి.
పరిమితికి మించి గ్యాస్ సిలిండర్లను నిల్వ చేస్తుంటే మీకు ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అధికారుల తనిఖీల్లో పట్టుబడితే కేసు నమోదు చేయడంతో పాటు జైలుశిక్ష పడే అవకాశముంటుంది. దీంతో పరిమితికి మంచి మీ ఇంట్లో సిలిండర్లు ఉంచుకోకపోవడమే మంచిదని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ఎక్కువ సిలిండర్లు ఉండటం వల్ల ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇంట్లో ఎక్కువ సిలిండర్లను ఉంచుకోకపోవడం మీకే మంచిది.