సాధారణంగా ఈవీ స్కూటర్స్‌లో లిథియం-అయాన్ బ్యాటరీలను ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువగా 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటాయి. అయితే, బ్యాటరీ జీవితం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలను ఛార్జింగ్ సైకిల్స్ ఆధారంగా కొలుస్తారు. మంచి నాణ్యత ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీ 800 నుండి 1,500 ఛార్జింగ్ సైకిల్స్ వరకు ఉంటుంది. ఒక వ్యక్తి రోజూ 30-40 కి.మీ. స్కూటర్ నడిపి బ్యాటరీని సరిగ్గా ఛార్జ్ చేస్తే, అది దాదాపు 4-5 సంవత్సరాలు పనిచేస్తుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ వేగంగా డిశ్చార్జ్ కావడం ప్రారంభం కావడంతో ఛార్జ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటే, లేదా దాని పనితీరు తగ్గితే, అది బ్యాటరీని మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి. చాలా కంపెనీలు బ్యాటరీపై 3-5 సంవత్సరాల వారంటీని అందిస్తాయి. కాబట్టి వారంటీ గడువు ముగిసిన తర్వాత బ్యాటరీని తనిఖీ చేయడం ముఖ్యం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి