PM Kisan: రైతులందరికీ అలర్ట్.. ఒకే క్లిక్‌తో పీఎం కిసాన్‌కు నిమిషాల్లోనే అప్లై చేసుకోవచ్చు.. ఎలానో చూడండి

పీఎం కిసాన్ 22వ విడత డబ్బుల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. నవంబర్‌లో తమిళనాడులో జరిగిన కార్యక్రమంలో 21వ విడత నిధులను ప్రధాని మోదీ రైతుల అకౌంట్లలోకి విడుదల చేశారు. త్వరలో మరో విడత డబ్బులు విడుదల కానున్నాయి.

PM Kisan: రైతులందరికీ అలర్ట్.. ఒకే క్లిక్‌తో పీఎం కిసాన్‌కు నిమిషాల్లోనే అప్లై చేసుకోవచ్చు.. ఎలానో చూడండి
Pm Kisan

Updated on: Jan 16, 2026 | 1:59 PM

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పధకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. నేరుగా నగదును రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. ఏడాదిలో మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున అందిస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలు అకౌంట్లలో జమ చేస్తోంది. గత ఏడాది నవంబర్‌లో 21వ విడత డబ్బులను విడుదల చేయగా.. 22వ విడత డబ్బులను వచ్చే నెలలో విడుదల చేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ తన చేతుల మీదుగా బటన్ నొక్కి డబ్బులు రిలీజ్ చేయనున్నారు.

10 కోట్ల మంది లబ్దిదారులు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ లబ్దిదారులుగా ఉన్నారు. అర్హత పొందిన వారి నుంచి కేంద్రం ఎప్పటికప్పుడు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎప్పుడైనా ఈ పథకం కింద లబ్ది పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి గడువు విధించలేదు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు మీ వివరాలు, డాక్యుమెంట్లు పరిశీలించి లబ్దిదారుల జాబితాలో చేర్చుతారు. అనంతరం మీ అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. ఎలా ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

-పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
-న్యూ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి
-12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
-మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
-మీ స్టేట్‌ను ఎంచుకుని క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి
-అనంతరం గెట్ ఓటీపీ బటన్‌పై ప్రెస్ చేయండి
-ఓటీపీ ఎంటర్ చేసి ప్రాసెస్ చేయండి
-అవసరమైన వ్యక్తిగత, భూమి వివరాలు అందించండి
-డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి
అనంతరం అన్నీ వివరాలు చెక్ చేసుకుని ఫారంను సమర్పించండి
-దరఖాస్తు సమర్పించాక స్టేటస్‌ను రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు

ఈ తప్పులు చేయకండి

-ఈకేవైసీని పూర్తి చేయకుండా ఉండకండి
-బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే డబ్బులు పడవు
-రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సమాచారం ఇవ్వకండి