Business Ideas: ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!

Business Ideas: స్థానికంగా ఒక చిన్న దుకాణం నడుపుతున్న వ్యాపారి తన ఉత్పత్తులను కేవలం ఆ దుకాణానికి వచ్చే కస్టమర్‌లకే పరిమితం చేస్తాడు. కానీ, కొందరు తెలివైన వ్యాపారులు తమ వ్యాపారాన్ని ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా విక్రయాలు సాగిస్తూ మంచి లాభాలను..

Business Ideas: ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
Business Ideas

Updated on: Aug 14, 2026 | 9:45 PM

Business Ideas: ఆధునిక కాలంలో చిన్న వ్యాపారాలు కేవలం ఆఫ్‌లైన్ అమ్మకాలపై ఆధారపడితే వృద్ధి సాధించడం కష్టం. తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, లాభాలను పెంచుకోవడానికి ఆన్‌లైన్ మార్కెట్ ఒక బలమైన వేదికగా నిలుస్తుంది. ఇది కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా, చిన్న స్థానిక వ్యాపారాలకు కూడా వర్తిస్తుంది. తమ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆన్‌లైన్ ఒక శక్తివంతమైన సాధనం.

ఉదాహరణకు, హోమ్‌మేడ్ స్నాక్స్ వ్యాపారాన్ని పరిశీలిద్దాం. స్థానికంగా ఒక చిన్న దుకాణం నడుపుతున్న వ్యాపారి తన ఉత్పత్తులను కేవలం ఆ దుకాణానికి వచ్చే కస్టమర్‌లకే పరిమితం చేస్తాడు. కానీ, కొందరు తెలివైన వ్యాపారులు తమ వ్యాపారాన్ని ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా విక్రయాలు సాగిస్తూ మంచి లాభాలను పొందుతారు. వారి అనుభవాన్ని వివరిస్తూ, తన షాపుకు వచ్చే కస్టమర్‌లు, వారి బంధువులు చాలా మంది బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, యూఎస్, యూకే వంటి దేశవిదేశాల్లో స్థిరపడ్డారని, వారందరూ తమ స్వగ్రామ స్నాక్స్‌ను మిస్ అవుతున్నారని గుర్తిస్తూ.. ఈ అవసరాన్ని గుర్తించిన ఒక వెబ్‌సైట్‌ను సృష్టిస్తారు. ఆ వెబ్‌సైట్‌లో తన షాపులో దొరికే ప్రతీ ఉత్పత్తిని అప్‌డేట్ చేసి, వివరాలు, ధరలు పొందుపరిచారు. ఈ వెబ్‌సైట్ లింక్‌ను తన కస్టమర్‌లకు, వారి బంధువులకు పంపిస్తుంటారు. దీని ద్వారా దేశవిదేశాల్లో ఉన్నవారు కూడా సులువుగా వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసుకుని, ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేయగలుగుతారు. డబ్బులు నేరుగా అకౌంట్‌లో పడతాయి. ఆర్డర్ రాగానే కొరియర్ ద్వారా స్నాక్స్‌ను పంపిస్తారు. ఈ విధానం వల్ల లాభాలు గణనీయంగా పెరిరుగుతాయి. కేవలం 50,000 లాభం సంపాదించే తన ప్రత్యర్థి షాపు యజమాని కంటే రూ. 80,000 లాభం వరకు సంపాదించగలుగుతారు.

ఇది కూడా చదవండి: Life Insurance: పాలసీదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బీమా డబ్బు ఎవరికి దక్కుతుంది? ఎవరు అర్హులు?

ఇవి కూడా చదవండి

గతంలో వెబ్‌సైట్ నిర్మాణం అంటే అధిక ఖర్చు (రూ. 20,000 నుండి 30,000 వరకు), కోడింగ్ పరిజ్ఞానం అవసరం అని భావించేవారు. అయితే, నేటి ఆధునిక AI టూల్స్ సహాయంతో కోడింగ్ పరిజ్ఞానం లేనివారు కూడా సులభంగా సొంత ఆన్‌లైన్ స్టోర్‌ను నిర్మించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌లు వెబ్‌సైట్ హోస్టింగ్‌ను నిర్వహిస్తాయి. SSL తో సొంత డొమైన్‌ను కనెక్ట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తాయి.

ఇవి Razorpay, Stripe వంటి పేమెంట్ గేట్‌వేలను అనుసంధానించే సౌలభ్యాన్ని కూడా అందిస్తాయి. తద్వారా UPI చెల్లింపులను కూడా స్వీకరించవచ్చు. అప్లికేషన్ డేటా Managed MongoDB లో నిల్వ అవుతుంది. అవసరమైతే ఇతర డేటాబేస్‌లను కూడా అనుసంధానించవచ్చు. పూర్తి స్టాక్ అప్లికేషన్లను నిర్మించగల ఈ AI ప్లాట్‌ఫామ్‌లు, ఫ్రంట్‌ఎండ్, బ్యాక్‌ఎండ్, డేటాబేస్ భాగాలను కలిగి ఉంటాయి. ట్రాఫిక్ పెరిగినా స్కేలబిలిటీకి మద్దతు ఇస్తాయి. అయినప్పటికీ అపరిమిత ట్రాఫిక్‌ను ఏ ప్లాట్‌ఫాం కూడా నిర్వహించలేదని గమనించాలి. అవసరమైతే, అభివృద్ధి చెందిన ఫీచర్‌ల కోసం నిపుణులైన డెవలపర్ సహాయం పొందవచ్చు.

ఇది కూడా చదవండి: మొక్క జొన్న ఉడకబెట్టి తినడం మంచిదా? కాల్చి తినడం మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

ఈ విధంగా AI ఆధారిత వెబ్‌సైట్ బిల్డర్‌లను ఉపయోగించుకోవడం ద్వారా చిన్న వ్యాపారాలు తమ పరిధిని విస్తరించుకుని, దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా కస్టమర్‌లను ఆకర్షించి, తమ లాభాలను అనేక రెట్లు పెంచుకోవచ్చు. ఇది నిజంగా వ్యాపార వృద్ధికి ఒక అద్భుతమైన అవకాశం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us