ఫెయిర్&లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలన నిర్ణయం.. ‘ఫెయిర్’ తొలగింపు..

హిందూస్థాన్ యూనిలీవర్ 'ఫెయిర్ అండ్ లవ్లీ' టైటిల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ప్రముఖ బ్రాండ్ ఫెయిర్ అండ్ లవ్లీ నుండి 'ఫెయిర్' అనే పదాన్ని తొలగించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్ష, సౌందర్య ప్రామాణికతపై చర్చ జరుగుతోన్న...

ఫెయిర్&లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలన నిర్ణయం.. ఫెయిర్ తొలగింపు..

Edited By:

Updated on: Jun 25, 2020 | 3:29 PM

హిందూస్థాన్ యూనిలీవర్ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ టైటిల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ప్రముఖ బ్రాండ్ ఫెయిర్ అండ్ లవ్లీ నుండి ‘ఫెయిర్’ అనే పదాన్ని తొలగించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్ష, సౌందర్య ప్రామాణికతపై చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఈ డెసిషన్ తీసుకుంది. ఈ మేరకు దీన్ని రీ బ్రాండ్ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఫెయిర్ అండ్ లవ్లీకి చేసిన మార్పులతో పాటు, మిగిలిన స్కిన్ ప్రొటక్షన్‌ పోర్ట్ ఫోలియో కూడా పాజిటివ్ బ్యూటీ, సమగ్ర దృష్టిని ప్రతిబింబిస్తుందని పేర్కొంది. రెగ్యులేటరీ ఆమోదం తర్వాత ‌రాబోయే కొద్ది నెలల్లో పేరును ప్రకటిస్తామన్నారు.

‘ఫెయిర్’ అనే పదంతో పాటు ప్యాకేజీ మీద ఉండే ఫెయిర్, ఫెయిర్ నెస్, వైట్, వైటనింగ్, లైట్, మెరుపు వంటి పదాలను కూడా తొలగిస్తున్నట్లు హెచ్‌యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. ఇవే కాకుండా ప్యాక్ మీద ఉండే రెండు ముఖాలు అంటే నల్లగా కనిపించే ముఖాన్ని కూడా రిమూవ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మార్పుల అనంతరం కొత్త పేరుతో మరికొద్ది నెలల్లోనే వినియోగదారుల ముందుకు ఈ కంపెనీ రాబోతున్నట్లు  సంజీవ్ మెహతా తెలిపారు. కాగా ఇండియాలో విక్రయించే రెండు ఫెయిర్ నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ మల్టీనేషనల్ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించిన వారం తర్వాత హెచ్‌యూఎల్ ఈ నిర్ణయం ప్రకటించడం విశేషం.

Read More: 

పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. వంతెన పై నుంచి పడడంతో భారీ ధ్వంసం..

కరోనా ఉధృతి.. ధైర్యంగా ఉండాలంటూ నాగ్ ఆసక్తకిర ట్వీట్..

దారుణ హత్య.. టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..!

పెట్రోల్ ధరల మోత.. వాహనదారులకు ఝలక్..

Follow Us