Pan Card
పర్మినెంట్ అకౌంట్ నంబర్ అంటే చాలా మందికి తెలీదు. పాన్(PAN) నంబర్ అంటే అందరికీ తెలుస్తుంది. ఏ ఆర్థిక లావాదేవీ చేయాలన్నా ఇది తప్పనిసరి. ముఖ్యంగా వస్తువులను అమ్మడం, కొనడం, విసాకి అప్లై చేయాలన్నా, అతి ముఖ్యంగా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) దాఖలుకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది పది సంఖ్యలతో ఉంటుంది. ప్రతి పాన్ కార్డు జీవిత కాల వ్యాలిడిటీతో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మంజూరు చేస్తుంది. అయితే అనుకోని పరిస్థితిలో మీరు పాన్ కార్డు పోగొట్టుకుంటే? ఏం చేయాలి? కంగారు పడాల్సిన పని లేదు. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ మీకు డూప్లికేట్ కార్డు ఇస్తుంది. అదెలా పొందాలో వివరాలు చూద్దాం..
రీ అప్లై చేసుకోవాలి..
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కి రీఅప్లై చేసుకోవడం ద్వారా పోయిన పాన్ కార్డ్ స్థానంలో కొత్త కార్డ్ పొందవచ్చు. అయితే ముందుగా అందుకు కొన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీ పాన్ కార్డ్ పోగొట్టుకున్నారో అప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాల్సి ఉంటుంది. దీని ద్వారా మీ పాన్ కార్డును మరొకరు తప్పుగా ఉపయోగించే అవకాశం ఉండదు.
ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు ఇలా..
- ముందుగా TIN-NSDL అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ విధానాన్ని ఎంచుకోవాలి. ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులో మార్పులు, తప్పులను అప్డేట్ చేయడం లేదా రీప్రింట్ పాన్ కార్డ్ (ఎలాంటి మార్పులు లేకుండా) ఆప్షన్ ఎంచుకోవాలి.
- పేరు, జన్మదినం, మొబైల్ నంబర్, వంటి అవసరమైన వివరాలన్నింటినీ నమోదు చేయాలి.
ఆ తర్వాత సబ్‌మిట్ బటన్ నొక్కాలి.
- టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది. అది అప్లికెంట్ రిజిస్టర్డ్ ఈమెయిల్‌కి సైతం వస్తుంది.
వ్యక్తిగత వివరాలను నమోదు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ విధానాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
మూడు రకాలుగా అప్లికేషన్ ఫామ్ ఇవ్వొచ్చు.. నేరుగా వెళ్లి డాక్యుమెంట్లను సమర్పించడం, ఈ-కేవైసీ ద్వారా డిజిటల్‌గా డాక్యుమెంట్లు ఇవ్వడం లేదా ఇ-సైనింగ్ ద్వారా సమర్పించడం.
- నేరుగా ఐటీ ఆఫీసుకు వెళ్లి డాక్యుమెంట్లు ఇవ్వాలనుకుంటే.. అప్లికేషన్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ధ్రువీకరణ పత్రం జనరేట్ అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికేట్, పాస్‌పోస్ట్, ఎస్ఎస్ఈ సర్టిఫికెట్ వంటి వాటిపై సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి. వాటిని ఎన్ఎస్‌డీఎల్‌కు రిజిస్టర్ట్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. దానిపై ధ్రువీకరణ పత్రం నంబర్, అప్లికేషన్ ఫర్ పాన్ రీప్రింట్ వంటివి ఎన్వలాప్‌పై రాయాల్సి ఉంటుంది.
- ఈ-కేవైసీ ద్వారా.. ఈ సర్వీస్‌ను పొందడానికి ఆధార్ తప్పనిసరి. మీరు ఇచ్చిన సమచారాన్ని ధ్రువీకరించేందుకు ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తుది ఫారమ్ సబ్‌మిట్ చేసేటప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అవసరం అవుతుంది.
మీరు తప్పనిసరిగా ఫిజికల్ పాన్ కార్డ్ లేదా ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ అనేది ఎంచుకోవాలి.
- ఇ-పాన్ కార్డ్ కోసం వాలిడ్ ఈమెయిల్ తప్పనిసరిగా ఉండాలి. కాంటాక్ట్ వివరాలు, డాక్యుమెంట్ సమచారం అందంచి సబ్‌మిట్ చేయాలి.
- 15-20 వర్కింగ్ డేస్‌లో మీకు కొత్త పాన్ కార్డ్ వస్తుంది.
ఆఫ్‌లైన్ పద్ధతిలో ఇలా..
- రిక్వెస్ట్ ఫర్ న్యూ పాన్ కార్డ్ లేదా ఛేంజెస్ ఇన్ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
- పూర్తి వివరాలను నమోదు చేసి అవసరమైన చోట్ల సంతకాలు చేయాలి.
- వ్యక్తిగత దరఖాస్తు దారులు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలపై క్రాస్ సైన్ చేయాలి.
- ఎన్ఎస్‌డీఎల్‌కి అప్లికేషన్ ఫామ్, పేమెంట్, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్ ప్రూఫ్ వంటివి పంపించాలి. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకో ధ్రువీకరణ పత్రం వస్తుంది. దానిని జాగ్రత్తగా దాచుకోవాలి. అదే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది.
- మీరు పంపించిన అప్లికేషన్‌ను ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్ ప్రాసెస్ చేస్తుంది.
- రెండు వారాల్లో మీకు డూప్లికేట్ పాన్ కార్డు పంపిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..