ఉద్యోగుల పదవీవిరమణ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్). దీనిని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) నిర్వహిస్తుంది. ఉద్యోగి, అలాగే ఉద్యోగికి జీతం ఇచ్చే సంస్థ ఇద్దరూ ఉద్యోగి బేసిక్ శాలరీతో పాటు డియర్ నెస్ అలోవెన్స్ నుంచి 12శాతం ఈఫీఎఫ్ గా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వచ్చే మొత్తానికి పన్ను రాయితీ ఉంటుంది. అంతేకాక ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఎటువంటి పెనాల్టీ లేకుండా విత్ డ్రా చేయొచ్చు. కానీ విత్ డ్రా చేయకుండా ఉంటే ఉద్యోగి రిటైర్ అయినప్పుడు అసలుతో పాటు వడ్డీ కూడా కలిసి పెద్ద మొత్తంలో నగదు వచ్చే అవకాశం దీని ద్వారా కలుగుతుంది.
అయితే ప్రైవేటు ఉద్యోగులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే వారు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రైవేటు ఉద్యోగులు సంస్థలు మారుతుంటారు. అలా మారినప్పుడు తప్పనిసరిగా ఈపీఎఫ్ ని ట్రాన్స్ ఫర్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవు.
మీరు సంస్థ మారినప్పుడు తప్పనిసరిగా ఈపీఎఫ్ ఖాతాను కూడా ట్రాన్స్ ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. అదెలాగో చూద్దాం.. మీరు కంపెనీ మారిన తర్వాత కూడా ఈపీఎఫ్ ఖాతాను అలాగే వదిలేస్తే అప్పటి వరకూ జమైన నగదుపై వడ్డీ వస్తూనే ఉంటుంది. కానీ నెల నెలా కంట్రిబ్యూషన్ అకౌంట్ యాడ్ కాకపోవడం వల్ల మీకు వచ్చే వడ్డీపై పన్ను పడుతుంది. అలాగే నెలనెలా ఈపీఎఫ్ ఖాతాలో నగదు జమకాని కారణంగా పెన్షన్ బెనిఫిట్ కూడా తగ్గిపోతుంది. మొత్తంగా మీరు పీఎఫ్ ఖాతాను ట్రాన్ ఫర్ లేదా మెర్జ్ చేయని కారణంగా వడ్డీ కోల్పోవడంతో పాటు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కూడా కోల్పోతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..