
ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ).. సురక్షిత పెట్టుబడి పథకం. దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకం. అధిక వడ్డీతో పాటు మొత్తం నగదుకు భద్రత ఉంటుండటంతో అందరూ దీనిని వినియోగించుకుంటున్నారు. ఇటీవల అన్ని బ్యాంకులు ఈ ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచాయి. దేశంలోని అతి పెద్ద ఎన్బీఎఫ్సీ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ బుధవారం మరో స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్ రేటును ప్రకటించింది. కంపెనీ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ లో భాగంగా జూబిలీ డిపాజిట్(శ్రీరామ్ ఉన్నతి డిపాజిట్స్) ఎఫ్ డీ స్కీమ్ ను ప్రారంభించింది. దీనిలో ఏకంగా 9.15 శాతం వరకూ వడ్డీ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది 2023 ఏప్రిల్ ఐదో తేదీ నుంచి ప్రారంభమైంది. కొత్త ఖతాదారులతో పాటు పాత వాటిని రెన్యూవల్స్ కి కూడా ఈ కొత్త వడ్డీ రేటు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తరచుగా రెపో రెటో ను పెంచుతోంది. 2022 నుంచి మే నుంచి ఆరు సార్లుగా మొత్తం 250 బేస్ పాయింట్లను పెంచింది. ఈ ఫిబ్రవరీలో మరో సారి 25 బేస్ పాయింట్లను పెంచి రెపో రేటును 6.5శాతానికి తీసుకెళ్లింది. ఈ ప్రభావం బ్యాంకర్లపై పడింది. ఫలితంగా రుణాల వడ్డీ రేట్లను బ్యాంకర్లు గణనీయంగా పెంచారు. మరో వైపు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కూడా పెంచారు. దీంతో ఖాతాదారులకు ఉపశమనం లభించింది.
శ్రీరామ్ ఉన్నతి డిపాజిట్స్ కింద ప్రారంభించిన ఈ ఎఫ్ డీ స్కీమ్ లో ఖాతాదారులకు 9.15శాతం వడ్డీ వస్తుంది. 50 నెలల టెన్యూర్ తో ప్రారంభమయ్యే ఈ స్కీమ్ లో ప్రస్తుతం ఉన్న వడ్డీకి అదనంగా మహిళలు 0.10 శాతం, సీనియర్ సిటిజెన్స్ 0.50 శాతం , సీనియర్ సిటిజెన్ మహిళలు 0.60 శాతం వార్షిక వడ్డీని పొందుతారు. ఈ ఖాతా తెరవాలంటే ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లలో ప్రారంభించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..