Thunderbolt Electra: క్లాసీ లుక్‪లో పిచ్చెక్కిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్‪పై 120 కి.మీలు.. పూర్తి వివరాలు ఇవి..

|

Mar 28, 2023 | 5:00 PM

దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు థండర్ బోల్ట్ ఎలెక్ట్రా పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఇది ఆకర్షణీయమైన లుక్ లో, అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Thunderbolt Electra: క్లాసీ లుక్‪లో పిచ్చెక్కిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్‪పై 120 కి.మీలు.. పూర్తి వివరాలు ఇవి..
Thunderbolt Electra
Follow us on

పెట్రోల్ రేట్లు గణనీయంగా పెరుగుతున్న కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు అధికమవుతున్నాయి. చాలా ద్విచక్ర వాహన తయారీదారులు తమ విద్యుత్ శ్రేణి వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ దారు థండర్ బోల్ట్ ఎలెక్ట్రా పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఇది ఆకర్షణీయమైన లుక్ లో, అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దాదాపు 110 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్ ఈ స్కూటర్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

బ్యాటరీ, మోటార్ సామర్థ్యాలు ఇలా..

ఈ థండర్ ఎలెక్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.4 కిలో వాటల్ల సామర్థ్యం కలిగిన లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. అలాగే అత్యంత శక్తివంతమైన మోటార్ కూడా ఉంది. దీనిలోని బ్యాటరీ 4 నుంచి 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. గంటకు 55 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది.

ఫీచర్లు ఇలా..

ఈ థండర్ ఎలెక్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ లో అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ స్పీడో మీటర్, ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ సౌకర్యాన్ని అందిస్తోంది. ఫ్లాట్ లెగ్ ఫీట్, వైడ్ సీట్లు ఉంటాయి. అలాగే డిస్క్ బ్రేకింగ్ సిస్టంతో ఈ స్కూటర్ వస్తుంది. దీని ధర మన దేశంలో దాదాపు రూ. 79,999 ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..