FD Interest Rates: ఎఫ్‌డీ చేసేవారికి గుడ్ న్యూస్.. ఈ బ్యాంకులో ఏకంగా 9.25 వడ్డీరేటు..

ప్రభుత్వరంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు అత్యధిక శాతం వడ్డీని అందిస్తాయి. మీరు కనుక మీ పెట్టుబడిపై అధిక వడ్డీ కావాలనుకుంటే మాత్రం ఈ ఫైనాన్స్ సంస్థలే బెటర్.. అలాంటిదే ఈ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఎఫ్డీ చేయాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధికంగా 9.25 శాతం వడ్డీ పొందే అవకాశాన్ని అందిస్తోంది.

FD Interest Rates: ఎఫ్‌డీ చేసేవారికి గుడ్ న్యూస్.. ఈ బ్యాంకులో ఏకంగా 9.25 వడ్డీరేటు..
Fixed Deposit
Follow us

|

Updated on: Mar 06, 2024 | 7:53 AM

బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? మంచి వడ్డీ రేటు అందించే బ్యాంకు కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ కథనం. సాధారణంగా బ్యాంకులతో పాటు, ఫోస్టాఫీసుల్లోనూ ఫిక్స్ డ్ డిపాజిట్ చేసే వీలుంటుంది. అయితే వడ్డీ వీటిల్లో ఒకే రకంగా ఉండదు. బ్యాంకులను బట్టి మారుతుంది. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు అత్యధిక శాతం వడ్డీని అందిస్తాయి. మీరు కనుక మీ పెట్టుబడిపై అధిక వడ్డీ కావాలనుకుంటే మాత్రం ఈ ఫైనాన్స్ సంస్థలే బెటర్.. అలాంటిదే ఈ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఎఫ్డీ చేయాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధికంగా 9.25 శాతం వడ్డీ పొందే అవకాశాన్ని అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..

అత్యధిక వడ్డీ..

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (ఎస్ఎస్ఎఫ్ బీ) ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీరేటు అందిస్తోంది. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఎంపిక చేసిన కాలవ్యవధిలో చేసిన డిపాజిట్లకు ఈ అవకాశం కల్పించింది. ఈ కొత్త రేట్లు 2024 మార్చి ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి. 25 నెలల కాలవ్యవధిలో వడ్డీరేట్లు 41 బేసిస్ పాయింట్లు (బీపీఎస్)కు సవరించారు.

రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు..

ఈ బ్యాంకు రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 4 శాతం నుంచి 9.01 శాతం వరకూ, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం నుంచి 9.25 శాతం వరకూ వడ్డీ అందిస్తోంది. రెండేళ్ల ఒక్క నెల (25 నెలలు) కాల పరిమితికి చేసిన డిపాజిట్లకే ఈ అవకాశం ఉంది. అకాల ఉపసంహరణ, టర్మ్ డిపాజిట్ల మూసివేత, పునరుద్ధరణ, పాక్షిక ఉపసంహరణకు సంబంధించి ఆ డిపాజిట్ బ్యాంకులో ఉన్న కాలానికి వడ్డీ చెల్లిస్తారు. అటువంటి వాటికి వర్తించే పెనాల్టీ ఒక శాతం కన్నాతక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వడ్డీ రేట్ల వివరాలు..

ఈ బ్యాంకు అందించే వడ్డీరేట్లను తెలుసుకుందాం. 7 నుంచి 14 రోజుల వ్యవధిలో డిపాజిట్లపై సాధారణంగా 4 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం ఇస్తుంది. 91 రోజుల నుంచి ఆరు నెలల డిపాజిట్లపై సాధారణంగా 5 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.50 శాతం, అలాగే ఏడాదికి పైబడి 15 నెలలకు సాధారణంగా 8.25, సీనియర్ సిటిజన్లకు 8.75 శాతం, 25 నెలల డిపాజిట్లకు సాధారణంగా 9.01 శాతం, సీనియర్ సిటిజన్లకు 9.25 శాతం వడ్డీ అందుతుంది.

రికరింగ్ డిపాజిట్లపై..

సూర్యోదయ ఫైనాన్స్ బ్యాంకు సాధారణ పౌరులకు ఆరు నెలల నుంచి పదేళ్ల మధ్య కాలానికి చేసిన డిపాజిట్లపై 5 శాతం నుంచి 8.60 శాతం మధ్య వడ్డీ రేటు అందజేస్తుంది. రికరింగ్ డిపాజిట్ల (ఆర్ డీ)కు సంబంధించి కనీస వాయిదాగా రూ.100 చెల్లించాలి. అకాల ఉపసంహరణ విషయంలో డిపాజిట్ బుక్కింగ్ తేదీలో ఉన్న వడ్డీ రేటుతో బ్యాంకులో డిపాజిట్ ఉన్న కాలానికి చెల్లించబడుతుంది. వీటికి విధించే జరిమానా ఒక శాతం కన్నా తక్కువగానే ఉంటుంది. ఆరు నెలల డిపాజిట్లకు సాధారణంగా 5 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.50 శాతం, 15 నెలల డిపాజిట్లకు సాధారణంగా 8.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.75 శాతం, 36 నెలలకు సాధారణంగా 8.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 9.10 శాతం వడ్డీ లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..