EPF Account: పీఎఫ్ ఖాతా బ్లాక్ అయ్యిందా? అలా వదిలేయకండి.. ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా నష్టపోరు..

ద్యోగికి జీతం వస్తున్నప్పుడు ఆటోమెటిక్ గా ఈపీఎఫ్ చందా కట్ అవుతుంది. కానీ వారు పదవీ విరమణ చేసినా, విదేశాలకు వలస వెళ్లినా, మరణించిన సమయాలలో మూడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఈపీఎఫ్ కు చందా ఇవ్వలేనప్పుడు ఆ ఖాతా నిద్రాణ స్థితికి చేరుకుంటుంది. అంటే పనిచేయని ఖాతాగా మారుతుంది. అయితే ఇలాంటి ఖాతాలను తిరిగి (అన్ బ్లాక్ )బతికించుకోవచ్చు.

EPF Account: పీఎఫ్ ఖాతా బ్లాక్ అయ్యిందా? అలా వదిలేయకండి.. ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా నష్టపోరు..
Epf
Follow us

|

Updated on: Apr 21, 2024 | 2:18 PM

సాధారణంగా ఒక సంస్థ, ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉంటుంది. మనకు ప్రతి నెలా వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని దానికి చెల్లిస్తుంటారు. యజమానికి కూడా తన వాటాగా ఆ ఉద్యోగి పేరు మీద కొంత సొమ్ము కడుతూ ఉంటాడు. ఇది ప్రతినెలా జరిగే ప్రక్రియ. ఉద్యోగికి జీతం వస్తున్నప్పుడు ఆటోమెటిక్ గా ఈపీఎఫ్ చందా కట్ అవుతుంది. కానీ వారు పదవీ విరమణ చేసినా, విదేశాలకు వలస వెళ్లినా, మరణించిన సమయాలలో మూడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఈపీఎఫ్ కు చందా ఇవ్వలేనప్పుడు ఆ ఖాతా నిద్రాణ స్థితికి చేరుకుంటుంది. అంటే పనిచేయని ఖాతాగా మారుతుంది. అయితే ఇలాంటి ఖాతాలను తిరిగి (అన్ బ్లాక్ )బతికించుకోవచ్చు. ఇందుకు ఈపీఎఫ్ వో అవకాశం ఇచ్చింది.

ఉద్యోగ విరమణ పొదుపు పథకం..

సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం భారత ప్రభుత్వం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)ను ఏర్పాటు చేసింది. ఇది ఉద్యోగ విరమణ పొదుపు పథకం. ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) కింద నడుస్తుంది. వివిధ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు తమ నెలవారీ జీతాల్లో కొంత మొత్తాన్ని ఈ పథకానికి జమ చేస్తారు.

కేవైసీ వివరాలు..

నిద్రాణ స్థితికి చేరిన ఈపీఎఫ్ చందదారుల ఖాతాలను బతికించుకోవడానికి ఈపీఎఫ్ వో అవకాశం ఇచ్చింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ఆ ప్రకారం.. ఈపీఎఫ్ ఖాతాను అన్ బ్లాక్ చేయడానికి ముందుగా ఉద్యోగులు తమ కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేదో పరిశీలించాలి. అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలను చెక్ చేయాలి. అవి సక్రమంగా ఉంటే ఈ కింద తెలిపిన విధంగా ఈపీఎఫ్ ఖాతాను అన్‌బ్లాక్ చేసుకోవచ్చు.

  • ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
  • మీ ఆధారాలను ఉపయోగించి ఖాతాకు లాగిన్ అవ్వండి.
  • హెల్ప్ డెస్క్ విభాగానికి వెళ్లండి.
  • ఇన్‌ఆపరేటివ్ అకౌంట్ అసిస్టెన్స్ పై క్లిక్ చేయండి.
  • మీ గుర్తింపును ధ్రువీకరించడానికి వెబ్‌సైట్ అందించిన సూచనలను అనుసరించి, ఆపై సహాయం కోసం అభ్యర్థించండి.

నిబంధనలు ఇవి..

చందాదారులు తమ ఈపీఎఫ్ లో సొమ్మును ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విత్‌డ్రా చేసుకునేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. అధికారిక పోర్టల్‌ను సందర్శించడం, ఉమాంగ్ అప్లికేషన్‌కు వెళ్లడం ద్వారా ఈ పనులు చేసుకోవచ్చు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ వో)కు యూనిఫైడ్ నంబర్ పోర్టల్ ఉంది. చందాదారులు తమ బ్యాలెన్స్, పాస్‌బుక్ మొదలైన వాటిని తనిఖీ చేయడానికి దీని ద్వారా అనుమతిస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాదారులందరూ 58 ఏళ్ల వచ్చే వరకూ తమ సొమ్ముపై వడ్డీని పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..