మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్కీమ్ మహిళా స్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎంఎస్ఎస్సీ). మహిళలను పొదుపు వైపు మళ్లించి, వారి సాధికరతను లక్ష్యంగా పెట్టుకొని యూనియన్ బడ్జెట్ 2023-24లో ఈ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చారు. 2023 ఏప్రిల్ 1 ఈ స్కీమ్ ప్రారంభమైంది. మార్చి 2025 వరకూ దీనిలో పెట్టుబడులు పెట్టుకొనే అవకాశం ఉంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, భాగస్వామ్య ప్రైవేటు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మహిళలు ఈ ఎంఎస్ఎస్సీ ఖాతాను ప్రారంభించవచ్చు. ఎవరైనా మహిళలు లేదా మైనర్ బాలిక అయితే చట్టబద్ధమైన సంరక్షకుని పేరు మీద ఖతాను తెరవచ్చు. ఈ స్కీమ్ ప్రస్తుతం చాలా బ్యాంకులు అందిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), రెండు సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టెర్మ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడిని అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం అర్హతలు, రాబడి వివరాలను ఇప్పుడు చూద్దాం..
ఎంఎస్ఎస్సీ పథకంలో వడ్డీ రాబడి ప్రధాన త్రైమాసికంతో లెక్కించబడుతుంది. ఉదాహరణకు, మీరు రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే, మొదటి త్రైమాసికానికి వడ్డీ రూ. 3,750 అవుతుంది. రెండో త్రైమాసికం తర్వాత, అసలు మొత్తం, సంపాదించిన వడ్డీతో సహా మొత్తం మొత్తంపై వడ్డీ లెక్కించబడుతుంది. ఈ ప్రక్రియ ప్రతి త్రైమాసికంలో పునరావృతమవుతుంది, ఫలితంగా రెండేళ్ల వ్యవధి ముగిసే సమయానికి మెచ్యూరిటీ విలువ రూ. 2.32 లక్షలు.
ఎంఎస్ఎస్సీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి, మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కాపీని సమీపంలోని పోస్టాఫీసు లేదా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకుకు తీసుకెళ్లండి, డిపాజిట్ మొత్తం చెక్కును పూరించండి. ఖాతా ప్రారంభ ఫారమ్ కోసం అడగండి. అవసరమైన పత్రాలతో పాటు ఫారమ్‌ను సమర్పించి, మొత్తాన్ని డిపాజిట్ చేయండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..