5జీ అన్ని నగరాల్లోనూ అందుబాటులోకి వచ్చింది. దీంతో అందరూ 5జీ సపోర్టుతో కూడిన స్మార్ట్ ఫోన్ల కోసం వెతుకుతున్నారు. ఫలితంగా మార్కెట్లో 5జీ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో అన్ని కంపెనీలు 5జీలో తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. వాటిల్లో మంచి హై క్వాలిటీ అమోల్డ్ డిస్ ప్లే, అత్యధిక పనితీరు కలిగిన ప్రాసెసర్లు, ఆకట్టుకునే కెమెరాలతో ఉన్న ఫోన్లు చాలానే ఉన్నాయి. వాటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో రూ. 30,000లోపు ధరలో మంచి ఫీచర్లున్న 5జీ స్మార్ట్ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మొదటిగా రియల్ మీ ఫోన్ల నుంచి ప్రారంభిస్తే.. రియల్ మీ జీటీ2, రియల్ మీ జీటీ నియో3 ఈ రెండు ఫోన్లలో ఒకేరకమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే రెండు ప్రధాన తేడాలున్నాయి. రియల్ మీ జీటీ2 ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ఎస్ఓసీ పై ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో రియల్ మీ జీటీ నియో 3 మాత్రం మీడియా టెక్ డైమెన్సిటీ 8100 చిప్ సెట్ పై ఆధారపడి పనిచేస్తుంది. అదే విధంగా డిస్ ప్లే వచ్చేసరికి జీటీ2 6.62 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. జీటీ నియో 3 లో 6.7 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంటుంది. రెండు స్క్రీన్లు హెచ్ డీఆర్ 10ప్లస్, 120Hz రిఫ్రెష్ మెంట్ రేట్ తో ఉంటాయి. రెండు ఫోన్లు 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉన్నాయి. రెండింటిలోనూ వెనుక వైపు 50ఎంపీ, ఎంపీ, 2ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. రియల్ మీ జీటీ2 8జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. అదే విధంగా రియల్ మీ జీటీ నియో 3 8జీబీ/128జీబీ అయితే 28,999గా ఉంది.
దీనిలో స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్ ఉంటుంది. 12జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీనిలో 6.62 అంగుళాల హెచ్ డీఆర్ 10ప్లస్ ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 1300 నిట్స్ బ్రైయట్ నెస్ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. దీనిలో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలు ఉంటాయి. 4,700 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో కేవలం అరగంటలోనే సగం బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఈ ఫోన్ 12జీబీ ర్యామ్/256జీబీ వేరియంట్ ధర రూ. 28,999గా ఉంది.
ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 870 ఎస్ఓసీ చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. వెనుకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు ముందు వైపు 20ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. 4500 బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 67వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్టుతో వస్తుంది. కేవలం 40 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ ఎక్కుతుంది. 12జీబీ ర్యామ్/256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999గా ఉంది.
దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమెరీతో వస్తుంది. 6.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 48ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 5ఎంపీ, మాక్రో కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ స్నాపర్ ఉంటుంది. ముందు వైపు 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 25వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఉంటుంది. 8జీబీ ర్యామ్/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో కూడిన వేరియంట్ ధర రూ. 27,999గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..