Health Insurance Rejection: ఆరోగ్య బీమా క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ముఖ్య కారణాలు ఇవే!

|

Oct 08, 2024 | 3:37 PM

ఈ రోజుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అనేది చాలా ముఖ్యం. అత్యవసర సమయాల్లో ఆరోగ్య బీమా మీకు ఆర్థిక భరోసాను ఇస్తుంది. కానీ చాలామంది ఆరోగ్య బీమాను పెద్దగా పట్టించుకోవడం లేదు. కొందరు బీమా తీసుకున్నప్పటికీ క్లెయిమ్‌ విషయంలో తిరస్కరణకు గురవుతుంటాయి. చాలా మంది వ్యక్తులు ఇలాంటి తిరస్కరణకు గురైన..

Health Insurance Rejection: ఆరోగ్య బీమా క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ముఖ్య కారణాలు ఇవే!
Follow us on

ఈ రోజుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అనేది చాలా ముఖ్యం. అత్యవసర సమయాల్లో ఆరోగ్య బీమా మీకు ఆర్థిక భరోసాను ఇస్తుంది. కానీ చాలామంది ఆరోగ్య బీమాను పెద్దగా పట్టించుకోవడం లేదు. కొందరు బీమా తీసుకున్నప్పటికీ క్లెయిమ్‌ విషయంలో తిరస్కరణకు గురవుతుంటాయి. చాలా మంది వ్యక్తులు ఇలాంటి తిరస్కరణకు గురైన విషయంపై ఫిర్యాదులు చేస్తుంటారు. మరి బీమా పాలసీ తిరస్కరణకు గురవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

  1. ఆలస్యంగా ఫైల్‌ చేయడం: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ క్లెయిమ్‌లను నిర్ణీత గడువులోపు దాఖలు చేయడం మంచిది. గడువులోగా ఫైల్ చేయడం ఆలస్యమైనట్లయితే మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ బీమా సంస్థ నిర్దేశించిన గడువుల గురించి తెలుసుకోవడం, క్లెయిమ్‌ను దాఖలు చేసేటప్పుడు వెంటనే చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఎన్ని రోజుల్లోగా క్లెయిమ్ చేయాలో తెలుసుకుందాం.
  2. ఆరోగ్య సమస్యలను దాచడం: చాలా మంది బీమా తీసుకునేటప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి చెప్పకుండా దాచడం లాంటి చేస్తుంటారు. తమ గత ఆరోగ్య పరిస్థితులు, రికార్డులను దాచిపెడుతుంటారు. అయితే మీరు క్లెయిమ్ ఫైల్ చేసినప్పుడు ఇది మీకు సమస్యగా మారుతుంది. మీరు గత అనారోగ్యాన్ని దాచితే.. కంపెనీ ఆ విషయం తెలుసుకుంటే.. మీ క్లెయిమ్ తిరస్కరించే హక్కు వారికి ఉంటుంది.
  3. తప్పుడు సమాచారం ఇవ్వడం: ఇలా మంది ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేటప్పుడు వారి వయస్సు, ఆదాయం లేదా వృత్తికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని అందిస్తుంటారు. దీని వల్ల కూడా వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బీమా కంపెనీ ఈ వ్యత్యాసాన్ని గుర్తిస్తే, అది మీ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించుకోండి. క్లెయిమ్‌ల ప్రక్రియ సమయంలో సమస్యలను నివారించడానికి అందించిన మొత్తం సమాచారం ఖచ్చితమైనదని చూసుకోవాలి. ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వకుండా అన్ని వివరాలు సరిగ్గా ఇవ్వాలని గుర్తించుకోండి.
  4. పాలసీ పరిధిలోకి రాని చికిత్సలు: మీరు బీమా పాలసీ తీసుకునేటప్పుడు నియమ నిబంధనలు తప్పకుండా చదవాలి. ఏవైనా సందేహాలు ఉంటే తెలుసుకోవాలి. మీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో కొన్నిచికిత్సలకు క్లెయిమ్‌ చేసుకోలేరు. అవి ఏంటో ముందుగానే తెలుసుకోవాలి. అలా చేస్తే.. మీ క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి