
డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు మన డైలీ లైఫ్‌లో భాగం అయిపోయాయి. దాదాపు స్మార్ట్‌ఫోన్, బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడుతున్నారు. చాలా మంది చేతిలో నగదు ఉంచుకోవడం కంటే.. ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ప్రతి చోటా కూడా డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుండటంతో వీటి వాడకం విపరీతంగా పెరిగింది.
ప్రజలు ఇంత ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్‌పై ఆధారపడుతుండటంతో యూపీఐ సర్వీస్ కొద్ది సేపు పని చేయకపోయినా చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ, కొన్ని సార్లు సిస్టమ్ అప్డేట్స్ కోసం కొన్ని బ్యాంకులు తమ సర్వీస్‌ను నిలిపివేస్తుంటాయి. అయితే ఆ నిలిపివేత టైమ్‌తో ప్రజలకు తక్కువ ఇబ్బంది ఉండేలా చూసుకుంటారు. తాజాగా హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా తన సిస్టమ్ ఎసన్షియల్ సర్వీస్ కోసం ఈ నెల 7న అర్ధరాత్రి 12 గంటల నుంచి 1.30 గంటల వరకు తమ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న యూపీఐ సేవలకు అంతరాయం కలుగుతుందని తెలిపింది. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలంటూ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి