
HDFC Bank Alert: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవలకు అప్పుడప్పుడు నిర్వహణ పనుల వల్ల అంతరాయాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా వాట్సాప్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI వంటి డిజిటల్ సేవలు తాత్కాలికంగా పనిచేయవు. ఈ అంతరాయాలు సాధారణంగా షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా వస్తాయి. దీని గురించి బ్యాంక్ ముందుగానే కస్టమర్‌లకు SMS లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేస్తుంది. అందుకే మీ బ్యాంక్ సందేశాలను గమనించడం ముఖ్యం.
ఈ సేవలు డిసెంబర్ 13న తెల్లవారు జామున 2.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు మొత్తం 4 గంటల పాటు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని, అలాగే డిసెంబర్ 21న తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని సదరు బ్యాంకు తెలిపింది. ఈ సమయంలో HDFC బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయబడిన యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు.
డౌన్‌టైమ్ సమయంలో లావాదేవీల కోసం PayZapp వాలెట్‌ని ఉపయోగించమని బ్యాంక్ సిఫార్సు చేస్తుంది. బ్యాంకు సిస్టమ్స్ నిర్వహణలో భాగంగా ఈ రెండు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మెయింటెన్స్ పనులతో తమ బ్యాంక్ సేవల్లో ఏర్పడుతున్న అంతరాయాన్ని అర్థం చేసుకోవాలని, దీనిని వినియోగదారులు సహకరించాలని కోరింది. వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, విశ్వసనీయతను మెరుగుపరచడం, సున్నితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా మెయింటెనెన్స్ చేపడుతున్నట్లు బ్యాంక్ తెలిపింది.
Success Story: చదివింది 6వ తరగతి.. వినూత్న ఆలోచనలో అద్భుతమైన వ్యాపారం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి