HDFC Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్‌ దారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. ఎంత పెరిగాయంటే..

|

Feb 17, 2022 | 7:00 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న వారం తర్వాత..

HDFC Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్‌ దారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. ఎంత పెరిగాయంటే..
Follow us on

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న వారం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ FD వడ్డీ రేట్లను పెంచింది. చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచాయి. ఈ జాబితాలో ప్రైవేట్ రంగ రుణదాత HDFC బ్యాంక్ చేరింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 14, 2022 నుండి అమలులోకి వస్తాయి.

బ్యాంక్ 1-సంవత్సరం FD వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచి 4.9% నుండి 5%కి పెంచింది. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు 5 బేసిస్ పాయింట్లు 5.40% నుండి 5.45%కి పెంచింది. అంతకుముందు, జనవరిలో బ్యాంక్ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య కాలవ్యవధికి వడ్డీ రేటును 5.2%కి, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు 5.4%కి, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు 5.6%కి పెంచింది.

FD పెట్టుబడిదారులకు శుభవార్త
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 10, 2022న ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. RBI ద్రవ్య విధాన ప్రకటన తర్వాత ఒక రోజు తర్వాత, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, UCO బ్యాంక్ వడ్డీ రేట్లు సవరించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDలు) వడ్డీ రేట్లను 10-15 బేసిస్ పాయింట్లు పెంచింది. ఫిబ్రవరి 15, 2022 ఇది అమల్లోకి వచ్చింది.

Read Also.. TATA Motors: ఆ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ప్రకటించిన కార్ల దిగ్గజం టాటా మోటార్స్..