HDFC బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా! కారణం ఏంటో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

HDFC బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ చక్రవర్తి వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు విరుద్ధమైన పరిణామాలను కారణం చూపుతూ రాజీనామా చేశారు. ఈ వార్తతో బ్యాంక్ షేర్లు పడిపోయాయి. RBI ఆమోదంతో కేకి మిస్త్రీ తాత్కాలిక ఛైర్మన్‌గా నియమితులయ్యారు. చక్రవర్తి పదవీకాలంలో HDFC విలీనం వంటి కీలక మార్పులు జరిగాయి.

HDFC బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా! కారణం ఏంటో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!
Hdfc Bank Chairman Chakrava

Updated on: Mar 19, 2026 | 7:30 AM

భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌లలో ఒకటైన HDFC బ్యాంక్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా ఉన్న చక్రవర్తి తన పదవికి రాజీనామా చేసినట్లు బ్యాంక్ బుధవారం ప్రకటించింది. వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు విరుద్ధంగా కొన్ని పరిణామాలు బ్యాంకులో గమనించానని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ అంశాలపై మరింత వివరాలు వెల్లడించలేదు.

ఈ రాజీనామా మార్చి 19 నుంచి అమల్లోకి రానుండగా, తాత్కాలికంగా కేకి మిస్త్రీను పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా నియమించేందుకు RBI ఆమోదం తెలిపింది. మూడు నెలల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి అయిన చక్రవర్తి, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా పనిచేసి 2020లో పదవీ విరమణ చేశారు. అనంతరం 2021లో RBI ఆమోదంతో HDFC బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2024లో ఆయన పదవీకాలాన్ని 2027 వరకు పొడిగించారు.

ఆయన పదవీకాలంలోనే HDFC Ltdతో సుమారు 40 బిలియన్ డాలర్ల విలువైన విలీనం జరిగి, బ్యాంక్ మరింత భారీ ఆర్థిక సేవల సంస్థగా మారింది. అయితే ఈ తాజా రాజీనామా వార్తల ప్రభావంతో బ్యాంక్ యుఎస్-లిస్టెడ్ షేర్లు సుమారు 7 శాతం వరకు పడిపోయినట్లు సమాచారం. ముంబై మార్కెట్‌లో కూడా షేరు స్వల్ప నష్టంతో ముగిసింది. రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాలపై బ్యాంక్ లేదా చక్రవర్తి నుంచి స్పష్టత రాకపోవడంతో, ఈ పరిణామం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us