
రూ.5 ట్రాక్టర్ నోటు మీ దగ్గర ఉంటే రూ.లక్షలు మీ సొంతం. అవును.. మీరు విన్నది నిజమే. కొన్ని అరుదైన పాత, కొత్త నోట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఆన్‌లైన్లో పెట్టి రూ.లక్షకు అమ్మవచ్చు. ఇటీవల ఈ నోట్లకు సంబంధించిన ఆన్‌లైన్ మార్కెట్ పూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. అరుదైన పాత నోట్లను ఆన్‌లైన్‌లో విక్రయించి బోల్డెంత డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది. చాలామందికి పాతకాలపు కాయిన్లు, కరెన్సీ నోట్లను సేకరించే హాబీ ఉంటుంది. ఇలాంటివారు పాతకాలపు అరుదైన నోట్లను ఎంత ఖర్చు పెట్టినా సరే తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ ఉండటంతో.. రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. కొంతమంది వీటిని తమ వద్ద ఉంచుకునేందుకు రూ.లక్షలు ఖర్చు చేసి మరీ తీసుకుంటున్నారు.
ఇటీవల ట్రాక్టర్ ఫొటో కూడిన రూ.5 కరెన్సీ నోటుకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. వీటిని సొంతం చేసుకునేందుకు కాయిన్స్, నోట్లు సేకరించేవారు రూ.లక్షలు ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. రెట్టింపు ధరకు ఇవ్వడానికి వీళ్లు వెనుకడుగు వేయడం లేదు. ఇలాంటి నోట్లు కలిగి ఉన్నవారు వీటిని ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో పెట్టి విక్రయిస్తున్నారు. ఇక ట్రాక్టర్ ఫొటోతో పాటు 123 లేదా 786 సీరియల్ నంబర్ ఉన్న కరెన్సీ నోట్లను కూడా ఎక్కువ ధరకు తీసుకుంటున్నారు. కొన్ని మతాల్లో ఈ అంకెల నోట్లకు విశేషమైన ఆదరణ ఉందని, అందుకే ఎక్కువ ధర పలుకుతున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆన్‌లైన్లోనే అనేక వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్లలో కరెన్సీ నోట్లను అప్ లోడ్ చేస్తున్నారు. వాటి ఫొటోలతో పాటు సీరియల్ నెంబర్లు కనిపించేలా పోస్టులు పెడుతున్నారు. ఎంత ధరకు అమ్ముతామనే వివరాలు కూడా పెడుతున్నారు. దీంతో కొనుగోలుచేసేవారు ఈ ఫ్లాట్‌ఫామ్్ ద్వారా తీసుకుంటున్నారు. అయితే ఇలంటివి కొనుగోలు చేసేముందు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు నకిలీ నోట్లను పోస్ట్ చేసి విక్రయించవచ్చు. దీంతో ఫొటోలు స్పష్టంగా ఉన్నాయో.. లేదా చూసుకోవాలి. అలాగే కొన్నిచోట్ల అరుదైన పాత నోట్లకు వేలం పాట నిర్వహిస్తూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్లి అయినా కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు సైబర్ నేరగాళ్లు నకిలీ నోట్లతో మోసాలకు గురి చేసే అవకాశముంటుంది. విక్రయదారుడికి సంబంధించిన వివరాలు అన్నీ తెలుసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. లేకపోతే మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.