Harley Davidson: హార్లే డేవిడ్సన్‌ నుంచి అద్భుతమైన ఎలక్ట్రిక్‌ బైక్‌.. యారో ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో..

|

Feb 20, 2022 | 11:38 AM

Harley Davidson: మార్కెట్లో రకరకాల బైక్స్‌ విడుదలవుతున్నాయి. యువతను దృష్టిలో ఉంచుకుని పలు వాహనాల తయారీ కంపెనీలు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాలను..

Harley Davidson: హార్లే డేవిడ్సన్‌ నుంచి అద్భుతమైన ఎలక్ట్రిక్‌ బైక్‌.. యారో ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో..
Follow us on

Harley Davidson: మార్కెట్లో రకరకాల బైక్స్‌ విడుదలవుతున్నాయి. యువతను దృష్టిలో ఉంచుకుని పలు వాహనాల తయారీ కంపెనీలు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక అమెరికాకు చెందిన ప్రీమియం మోటార్‌ సైకిళ్ల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్‌ త్వరలోనే మరో ఎలక్ట్రిక్‌ బైక్‌ ( Electric Bike) తీసుకురానుంది. లైవ్‌వైర్‌ బ్రాండ్‌ (LiveWire Brand)కింద మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ బైక్‌ను S2Del Marగా పేరు పెట్టింది కంపెనీ. ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ మిడిల్‌-వెయిట్‌ విభాగంలోకి వస్తుంది. యారో ఆర్కిటెక్చర్‌తో కూడిన ఈ బైక్‌లో ముఖ్యమైనవి బ్యాటరీ, ఇన్వర్టర్‌, ఛార్జర్‌, స్పీడ్‌ కంట్రోలర్‌, మోటారు వంటి ఈ బైక్‌కు ఉన్నాయి. ఈ బైక్‌ యారో ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో రానుంది. ఈ బైక్ సరసమైన ధరతో ఉండే అవకాశం ఉంది.

ఇందులో 21,700 రకాల సిలిండ్రికల్‌ సెల్స్‌తో కూడిన బ్యాటరీ ప్యాక్‌:

ఇందులో యారో ఆర్కిటెక్చర్‌ ద్వారా 21,700 రకాల సిలిండ్రికల్‌ సెల్స్‌తో కూడిన బ్యాటరీ ప్యాక్‌ను ఎలక్ట్రిక్‌ బైక్‌ కోసం హార్లే డేవిడ్సన్‌ ఉపయోగిస్తుంది. అయితే ఈ ఫార్మాట్‌ను టెస్లా, శాంసంగ్‌ వంటి పెద్ద కంపెనీలు కూడా ఉపయోగిస్తున్నాయి. ఇక హార్లే డేవిడ్సన్‌ లైవ్‌వైర్‌ తైవాన్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీ కంపెనీ Kymcoతో జతకట్టింది. సంస్థ ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ను ఈ సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ మధ్యలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Savings Scheme: మీ కుమార్తె భవిష్యత్తును మెరుగుపర్చుకోవడం కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఈ ప్రభుత్వ పథకంలో పన్ను మినహాయింపు

Gold Silver Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన బంగారం.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన వెండి ధర