Bajaj Chetak Electric Scooter: వచ్చేసింది హమారా బజాజ్ చేతక్ స్కూటర్.. పెట్రోల్‌తో పని లేదు, ధర ఎంతంటే..?

| Edited By: Janardhan Veluru

Feb 15, 2023 | 6:20 PM

పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు విరుగుడుగా చాలా మంది ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై మనసు మరల్చుకుంటున్నారు.

Bajaj Chetak Electric Scooter: వచ్చేసింది హమారా బజాజ్ చేతక్ స్కూటర్.. పెట్రోల్‌తో పని లేదు, ధర ఎంతంటే..?
Bajaj Chetak
Follow us on

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు విరుగుడుగా చాలా మంది ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై మనసు మరల్చుకుంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇప్పటికే మార్కెట్లో స్కూటర్లు పెద్ద ఎత్తున అమ్ముడు అవుతున్నాయి. దిగ్గజ కంపెనీలు కూడా ఈ రంగంలోకి ప్రవేశించి ఎలక్ట్రిక్ స్కూటర్ లను పెద్ద ఎత్తున మార్కెట్లోకి తెస్తున్నాయి.అటు బజాజ్ కంపెనీ సైతం తమ ఐకానిక్ బ్రాండ్ అయినటువంటి చేతక్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్లోకి తెస్తుందని ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తోంది.. అయితే తాజాగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు పొందినట్లు బజాజ్ ఆటో తెలిపింది.

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన బజాజ్.. దాని అత్యంత ప్రసిద్ధ స్కూటర్ బజాజ్ చేతక్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో విడుదల చేసింది. హమారా బజాజ్’గా ప్రసిద్ధి చెందిన ఈ స్కూటర్ ఇప్పుడు ఎలక్ట్రిక్‌గా మారింది. మంచి ఫీచర్లతో పాటు కొత్త లుక్స్‌ని కలిగి ఉంది.

బజాజ్ చేతక్ ఫీచర్లు:

బజాజ్ నుండి ఈ గొప్ప ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. దీని లుక్ గురించి చెప్పాలంటే, చాలా స్టైలిష్‌గా ఉంది. ఫ్రంట్ లైట్ కూడా గుండ్రంగా ఉంది. దీని బాడీ మొత్తం మెటల్ తో తయారు చేశారు.డిస్‌ప్లేలో బ్యాటరీ శాతంతో పాటు, GPS, బ్లూటూత్ ఛార్జింగ్, జియో మ్యాప్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, LED ల్యాంప్స్ మొదలైనవి ఉన్నాయి. ఇది 4080W BLDC ఎలక్ట్రిక్ మోటారుతో పాటు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ బ్యాటరీపై కంపెనీ 3 సంవత్సరాల వారంటీని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

బజాజ్ చేతక్ ఒక్క ఛార్జ్‌తో ఎంతకాలం నడుస్తుంది?

కంపెనీ ప్రకారం, బజాజ్ చేతక్‌లో రెండు మోడ్‌లు ఉన్నాయి మరియు దాని ప్రకారం దాని మైలేజీ నిర్ణయించబడుతుంది. దీని మొదటి మోడ్ ఎకో, దీనిలో స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు నడుస్తుంది. మరోవైపు, స్పోర్ట్స్ మోడ్ ఉంది, దీనిలో స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్లు నడుస్తుంది.

భారతదేశంలో బజాజ్ చేతక్ ధర ఎంత?

భారతదేశంలో బజాజ్ విడుదల చేసిన ఈ ప్రీమియం స్కూటర్ ధర రూ. 1.51 లక్షలుగా నిర్ణయించారు.. ఇది ఎక్స్ షోరూమ్ ధర, ఆన్ రోడ్ తర్వాత రూ. 1,57,943 అవుతుంది.

ఇప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ లు అయినటువంటి. Ather, Ola, TVS iQube, Hero Vida వంటి పోటీకి అనుగుణంగా, బజాజ్ చేతక్ 2423 ప్రీమియంను విడుదల చేస్తున్నారు. యువ రైడర్లను ఆకర్షించడంపై బజాజ్ చేతక్ ఎకకువగా దృష్టి పెట్టింది.కంపెనీ అయితే త్వరలోనే కంపెనీ సేల్స్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బజాజ్ చేతక్ ను కొనుగోలు చేసేందుకు సమీపంలోని బజాజ్ డీలర్ ను సంప్రదించాలి.

 

మరిన్ని టెక్నాలజీ వార్తలు చదవండి..