Cyber Crime: పేమెంట్ కంపెనీ నుంచి కోట్లు మాయం చేసిన సైజర్ నేరగాళ్లు.. ఎలా చేశారంటే..

|

May 21, 2022 | 2:37 PM

సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా కేటుగాళ్లు పేమెంట్ గేట్ వే లపై గురిపెట్టారు. బెంగళూరు కేంద్రంగా సేవలు అందించే పేమెంట్స్ గేట్ వే సంస్థ రేజర్ పే దీని వల్ల నష్టపోయింది.

Cyber Crime: పేమెంట్ కంపెనీ నుంచి కోట్లు మాయం చేసిన సైజర్ నేరగాళ్లు.. ఎలా చేశారంటే..
Cyber Crimes
Follow us on

సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా కేటుగాళ్లు పేమెంట్ గేట్ వే లపై గురిపెట్టారు. బెంగళూరు కేంద్రంగా సేవలు అందించే పేమెంట్స్ గేట్ వే సంస్థ రేజర్ పే దీని వల్ల నష్టపోయింది. సుమారు 800 ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్లను సైబర్ నేరగాళ్లు ఆథరైజ్ చేసి రూ.7.38 కోట్ల రూపాయలను కాజేశారు. గేట్ వే వ్యవస్థను ట్యాంపరింగ్ చేయటం ద్వారా ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Razorpay సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు లావాదేవీలను ఆడిట్ చేస్తున్నప్పుడు 831 లావాదేవీలకు సంబంధించి రూ. 7,38,36,192 కు సంబంధించిన వివరాలు సరిపోలకపోవటం వల్ల దొంగతనం వెలుగులోకి వచ్చింది. Razorpay Software Private Limited నిర్వహించిన అంతర్గత విచారణలో, కొంతమంది వ్యక్తులు లేదా వ్యక్తుల అథెంటికేషన్ ను తారుమారు చేశారని, అది తప్పుడు ‘ఆమోదానికి’ దారితీసిందని తెలుస్తోంది. విఫలమైన లావాదేవీల వివరాలు, తేదీ, సమయం, IP చిరునామాతో పాటు ఇతర సంబంధిత సమాచారం మే 16న సౌత్ ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంపెనీ అందించింది.

రొటీన్ పేమెంట్ ప్రక్రియలో.. అనధికారిక వ్యక్తులు చెడ్డ ఉద్ధేశంతో బ్రౌజర్ ను ట్యాంపర్ చేసేందుకు వినియోగించినట్లు కంపెనీ తెలిపింది. కొన్ని ఆన్ లైన్ వ్యాపార సైట్లు పాత తరానికి చెందిన రేజర్ పే పేమెంట్ వెర్షన్ వినియోగిస్తున్నందున ఈ నేరానికి నిందితులు పాల్పడగలిగినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. “ఇతర సిస్టమ్‌లు, మర్చంట్ డేటా, ఫండ్‌లు లేవని నిర్ధారించడానికి కంపెనీ ప్లాట్‌ఫారమ్‌పై ఆడిట్‌ను నిర్వహించింది. ఈ ఘటన వల్ల వినియోగదారులు ఎవరూ ప్రభావితం కాలేదని” కంపెనీ స్పష్టం చేసింది. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు కంపెనీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సత్కరణకు గురైన మెుత్తంలో కొంత భాగాన్ని కంపెనీ ఇప్పటికే తిరిగి పొందగలిగిందని తెలుస్తోంది. ఏదేమైనా మాయగాళ్లతో వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి