Business Idea: పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ.. ఈ పంట సాగుతో ఏడాది మొత్తం డబ్బే డబ్బు!

జామ పండు.. ఇది సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా.. లభించే ఫలం. ఇది కేవలం ఆరోగ్యానికి కాకుండా.. మన ఆదాయాన్ని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది. అవును జామ సాగు ద్వారా మీకు తక్కువ పెట్టుబడిలో ఎక్కవ మొత్తంలో ఆదాయం పొందవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

Business Idea: పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ.. ఈ పంట సాగుతో ఏడాది మొత్తం డబ్బే డబ్బు!
Business Idea

Updated on: Jun 27, 2026 | 1:54 PM

చాలా మంది తక్కువ పెట్టుబడితో ఎక్కవ ఆదాయం వచ్చే వాణిజ్య పంటల కోసం చూస్తుంటారు. అలాంటి వారికి జామకాయ సాగు చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అవును ఇది వానాకాలం సీజన్ కావడంతో వీటి కాపు కూడా ఇప్పుడు ఎక్కవగానే ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంగా ఉంటాయి. కాబట్టి వీటికి మార్కెట్‌లో డిమాండ్ కూడా ఎక్కవగానే ఉంటుంది. అంతేకాదు.. వీటిని మీరు సీజన్‌తో సంబంధం లేకుండా ఏదాడి పొదవునా పండిచొచ్చు. కానీ దానికి మీరు కొన్ని విషయాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా జామ చెట్టు బాగా కాపు రావడానికి సరైన టైంలో ఎరువుల వేయడం, కత్తిరింపులు చాలా అవసరం.

ఎలాంటి ఎరువులు, ఎప్పుడు వాడాలి?

మీరు వేసిన జామ చెట్టు ఏపుగా పెరగాలంటే మట్టిలో పోషకాలను పెంచే ఎరువులను వాడాలి. అవును మట్టిలో పోషక విలువలు పెంచడానికి నత్రజని, భాస్వరం , పొటాషియం , మాంగనీస్, ఇనుము, రాగి వంటివి పోషకాలు అవసరం. ముఖ్యంగా పొటాషియం పరిమాణాన్ని కొద్దిగా పెంచడం వల్ల కాపు బాగా వస్తుంది. కాబట్టి చెట్టుకు 5 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ప్రతి సంవత్సరం క్రమంగా 100 గ్రాముల నైట్రోజన్, 100 గ్రాముల పొటాష్, 40 గ్రాముల భాస్వరం చొప్పున పెంచుకుంటూ పోవాలి.

ఐదేళ్లు దాటిన తర్వాత జామ చెట్టుకు సంవత్సరానికి 500 గ్రాముల నైట్రోజన్, 200 గ్రాముల భాస్వరం, 500 గ్రాముల పొటాష్ అందించాలి. ఇందులో సగం నైట్రోజన్‌ను ఖచ్చితంగా సేంద్రీయ ఎరువుల రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. వర్షాకాలం పంట కోసం మొదటి రుతుపవనాల వర్షాల తర్వాత, శీతాకాలం పంట కోసం సెప్టెంబర్ మొదటి వారంలో మీరు జామ చెట్లకు ఎరువులు వేయాల్సి ఉంటుంది. అలాగే రసాయనిక ఎరువులతో పాటు నాణ్యమైన దిగుబడి కోసం సేంద్రీయ ఎరువులు కూడా కచ్చితంగా వాడాలి.

ఇక సేంద్రయ ఎరువుల విషయానికి వస్తే.. ఒక్కో చెట్టుకు 600 గ్రాముల వేప పిండి వేయొచ్చు.. తర్వాదా కాపు బాగా పెరుగుతుంది. అలాగే పశువుల ఎరువు, 100 గ్రాముల అజోస్పిరిల్లమ్, ఫాస్పో బ్యాక్టీరియా వంటి జీవ ఎరువులను కూడా వేయాల్సి ఉంటుంది.ఇవి వాడడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది

తక్కువ స్థలంలో ఎక్కవ దిగుబడి

తక్కువ సంరక్షణతో ఎక్కువ లాభాలు ఇచ్చే బిజినెస్ ఐడియాగా జామ సాగును ఎంచుకోవచ్చు. సాంప్రదాయ రకాల కంటే మార్కెట్లో ఎక్కువ ధర పలికే తైవాన్ పింక్ , వి.ఎన్.ఆర్ బిహి వంటి ఆధునిక రకాలను పండించడం ద్వారా మీరు అధిక మొత్తంలో లాభాలను పొందవచ్చు. అక్కవ స్థలంలో ఎక్కవ పంటను పొందడానికి మీరు చెట్ల మధ్య 5-6 మీటర్ల దూరం ఉంచితే, హై-డెన్సిటీ పద్ధతిలో ఈ దూరాన్ని 3 x 2 మీటర్లు లేదా 2 x 2 మీటర్లకు తగ్గించవచ్చు. తద్వారా మీరు తక్కవ స్థలంలోనే ఎక్కువ దిగుబడి సాధించి అధిక ఆదాయాన్ని అర్జిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us